Varavara Rao : వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ మంజూరు

విప్ల‌వ క‌వికి భారీ ఊర‌టనిచ్చిన కోర్టు

Varavara Rao : విప్ల‌వ ర‌చ‌యితల సంఘం నేత వ‌ర‌వ‌ర రావుకు భారీ ఊర‌ట ల‌భించింది. ఇప్ప‌టికే ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఆయ‌న‌పై కుట్ర కేసు న‌మోదైంది.

దేశానికి, రాష్ట్రానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారంటూ జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఆరోపించింది. ప్ర‌భుత్వాల‌ను కూల దోయ‌డం ద్వారా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్దిస్తుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారంటూ నివేదిక స‌మ‌ర్పించింది కోర్టుకు.

ఆపై వ‌ర‌వ‌ర‌రావు నిషిద్ద మాయివోస్టు పార్టీకి ప్ర‌తినిధిగా ప‌ని చేస్తున్నారంటూ ఆరోపించింది. ఆగ‌స్టు 10 వ‌ర‌కు బెయిల్ మంజూరు చేసింది గ‌తంలో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.

తాజాగా బెయిల్ మంజూరు గ‌డువు అయి పోవ‌డంతో తిరిగి విచార‌ణ‌కు వ‌చ్చింది వ‌ర‌వ‌ర‌రావు కేసు. ఈ మేర‌కు విప్ల‌వ‌క‌విగా సుప్ర‌సిద్దులైన ఆయ‌న కేసుపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు.

ఊర‌ట ల‌భించేలా తీర్పు చెప్పింది ధ‌ర్మాస‌నం. భీమా కోరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుకు(Varavara Rao) సుప్రీంకోర్టు బుధ‌వారం ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

త‌న‌కు శాశ్వ‌త బెయిల్ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాక‌రించ‌డాన్ని ఆయ‌న స‌వాల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

వ‌ర‌వ‌ర‌రావు పిటిష‌న్ పై న్యాయ‌మూర్తులు యూయూ ల‌లిత్ , అనిరుద్ద బోస్ , సుధాన్షు ధూలియా ధ‌ర్మాస‌నం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇచ్చిన స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేయ‌వ‌ద్దంటూ సూచించింది. కేవ‌లం వైద్య ప‌ర‌మైన కార‌ణాలతోనే బెయిల్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

ఇదిలా ఉండ‌గా భీమా కోరేగావ్ కేసులో ఆగ‌స్టు 28, 2018న వ‌ర‌వ‌ర రావును అరెస్ట్ చేశారు. 2020లో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో చికిత్స అందించారు.

Also Read : బీజేపీ జాతీయ వాదానికి అర్థం లేదు

Leave A Reply

Your Email Id will not be published!