SC Issues Notice To Shinde EC : ఈసీ..షిండేకు షాక్ సుప్రీం నోటీసు

శివ‌సేన పార్టీ విల్లు..బాణం గుర్తు

SC Issues Notice To Shinde EC : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని(SC Issues Notice) షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే శివ‌సేన బాల్ ఠాక్రేకు చెందిన పార్టీ గుర్తు విల్లు, బాణం తిరుగుబాటు చేసిన సీఎం ఏక్ నాథ్ షిండే వ‌ర్గానికి కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై రాద్దాంతం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని , ఇది పూర్తిగా మోదీకి దాసోహం అయ్యిందంటూ శివ‌సేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ఆరోపించారు.

దేశ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఒక పార్టికి సంబంధించి వ్య‌తిరేక వ‌ర్గానికి గుర్తులు కేటాయించ‌డం ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని మండిప‌డ్డారు. ఈసీ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గం సుప్రీంకోర్టును స‌వాల్ చేసింది. వీరి త‌ర‌పున ప్ర‌ముఖ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ వాదించారు. దీనిపై విచారించింది బుధ‌వారం సుప్రీంకోర్టు. ఇందులో భాగంగా శివ‌సేన పేరు, చిహ్నంపై పోరాటంలో ఉద్ద‌వ్ పిటిష‌న్ పై షిండే , ఈసీకి నోటీసులు జారీ చేసింది.

విచార‌ణ సంద‌ర్భంగా ఠాశ్రే శిబిరం పిటిష‌న్ నిర్వ‌హ‌ణ‌ను ఏక్ నాథ్ షిండే వ‌ర్గం ప్ర‌శ్నించింది. మ‌రాఠా మాజీ సీఎం ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా మొద‌ట ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాల‌ని వాదించారు. పూర్తిగా విచారించిన ధ‌ర్మాస‌నం కీల‌క తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకు, ఎన్నిక‌ల గుర్తును కేటాయించిన ఈసీకి నోటీసులు(SC Issues Notice) జారీ చేసింది. ఇరు వ‌ర్గాల పోరులో త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో ఈసీ విఫ‌ల‌మైంద‌ని మాజీ సీఎం కోర్టుకు తెలిపారు.

Also Read : అదానీ మోదీ లింకు ఏమిటో చెప్పాలి

Leave A Reply

Your Email Id will not be published!