Supreme Court Jallikattu : జల్లికట్టుకు సుప్రీంకోర్టు ఓకే
సాంస్కృతిక వారసత్వమని తీర్పు
Supreme Court Jallikattu : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తమిళనాడు జల్లి కట్టు వివాదానికి సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ప్రకటించింది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలలో గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తున్న జల్లి కట్టు పోటీలను సమర్థించింది. ఇది పూర్తిగా ప్రజల సంస్కృతిలో అంతర్భాగమని పేర్కొంది. ఏదో ఒక నెపంతో దానిని నిలిపి వేయాలని అనుకోవడం సబబు కాదని పేర్కొంది విచారణ సందర్భంగా.
ఈ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. దీని గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. జల్లి కట్టు అనేది సమాజంలో భాగమే కాదు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అంటూ పేర్కొంది. దేశంలో భారీ ఎత్తున ఆదరణ చూరగొన్నది జల్లి కట్టు పోటీలు తమిళనాడులో. ఎద్దులను మచ్చిక చేసుకోవడం అనేది జల్లి కట్టు పోటీ. కర్ణాటక నాట గేదెల పందెం కంబాల పేరుతో పోటీ చెబుతూ వచ్చారు. ఇక మరాఠాలో ఎద్దుల బండ్లతో పందెం పోటీ జరుగుతోంది.
ఆయా పోటీలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు చేసిన సవరణలు చెల్లుబాటు అవుతాయని, ఇదే క్రమంలో జల్లికట్టుపై తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సమర్థిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పోటీల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది.
ఇందుకు సంబంధించి మూడు రాష్ట్రాలు చట్టంలో చేసిన సవరణలు చెల్లుబాటు అవుతాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దీనితో పాటు, ఈ ఆటలు సంస్కృతికి సంబంధించినవి, క్రూరత్వానికి సంబంధించినవి కాదని కోర్టు పేర్కొంది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మూడు రాష్ట్రాల్లో జంతువులకు సంబంధించిన ఆటను సాంస్కృతిక వారసత్వంగా పరిగణించింది.ఆర్టికల్ 15ఎని ఉల్లంఘించ లేదని పేర్కొంది ధర్మాసనం.
Also Read : Amazon Invest
