Supreme Court Adani : అదానీ 34 ఎకరాలపై కీలక కామెంట్స్
అదానీకి కేటాయించిన భూములు
Supreme Court Adani : భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి కేటాయించిన 34 ఎకరాలను సేకరించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు(Supreme Court Adani). జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ గుజరాత్ హైకోర్టు జూన్ 2021 ఉత్తర్వు సీడబ్ల్యూసీపై చట్ట బద్దమైన కార్పొరేషన్ కు హాని కలిగించే , ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం కలిగించే పరిష్కారాన్ని విధించిందని పేర్కొంది.
రాష్ట్ర ఆధీనంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆమోదం లేదా మినహాయింపు పొందడంలో విఫలమైతే గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ కు పక్కనే ఉన్న 34 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏపీఎస్ఇజెడ్ఎల్ ను అనుమతించే న్యాయ పరమైన ఉత్తర్వులును సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టి వేసింది.
ఏపీఎస్ఈజెడ్ఎల్ , సీడబ్ల్యూసీ మధ్య వివాదంపై తాజా తీర్పును ఆదేశించింది. చట్ట బద్దమైన కార్పొరేషన్ , ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాలను సమతుల్యం చేయడంలో సమస్య ఉన్నప్పుడు హైకోర్టు విధానం సమతుల్యమైనదిగా ఉండాలని బెంచ్ పేర్కొంది.
ఫిబ్రవరి 2031 వరకు చెల్లుబాటు అయ్యే సబ్ లీజు కింద 2006 నుండి వేర్ హౌసింగ్ సదుపాయాన్ని నిర్వహిస్తున్న భూమిపై ఆరు నెలల్లోగా నిర్ణయించాలని హైకోర్టు కోరింది. డివిజన్ బెంచ్ అవలంభించిన విధానం. వాస్తవానికి సెటిల్ మెంట్ ను అంగీకరించమని సీడబ్ల్యూసీని బలవంతం చేసింది.
వివాదాన్ని పరిష్కరించడంపై హైకోర్టు ఆందోళన చెందితే , మొదటి రెండు షరతులను అంగీకరించమని సీడబ్ల్యూసీని బలవంతం చేస్తూనే మూడో షరతును ఏపీఎస్ఈజెడ్ఎల్ ని బలవంతం చేసి ఉండాలని స్పష్టం చేసింది.
యూనియన్ ఆఫ్ ఇండియా రెండు పరస్పర విరుద్దమైన స్వరాలతో మాట్లాడటం మంచిది కాదని పేర్కొంది ధర్మాసనం.
Also Read : స్పీడ్ లో జియో..ఐఫోన్ 12 హవా