Supreme Court Morbi : మోర్బీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్
ఎప్పటికప్పుడు గుజరాత్ హైకోర్టు పర్యవేక్షించాలి
Supreme Court Morbi : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన. ఇందులో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 177 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించాయి.
ఇది పక్కన పెడితే దీనికి పాలకులు, ఉన్నతాధికారులు, ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను స్వీకరించిన ఒరెవా కంపెనీదేనంటూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. మోర్బీ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఒక పీఐఎల్ పిటిషనర్ , మరొక స్వతంత్ర దర్యాప్తు కోరుతూ తమ అభ్యర్థనలతో హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మోర్బీ వంతెన కూలిన ఘటనకు(Supreme Court Morbi) సంబంధించిన దర్యాప్తును , ఇతర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గుజరాత్ హైకోర్టుకు సూచించింది.
ఇదిలా ఉండగా గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇప్పటికే ఈ ఘటనపై సుమోటోగా స్పందించి పలు ఉత్తర్వులు చేసింది. దీంతో ఈ పిటిషన్లను ఇప్పటికి విచారించ బోమంటూ స్పష్టం చేసింది సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
కాగా ఈ ఘటనలో తన ఇద్దరు బంధువులను కోల్పోయిన పీఐఎల్ పిటిషనర్ , మరో లిటిగేట్ స్వతంత్ర దర్యాప్తు జరిపి కుటుంబీకులను కోల్పోయిన వారికి గౌరవ ప్రదమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ తమ అభ్యర్థనలతో హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉండగా మోర్బీ వంతెన అక్టోబర్ 30న కూలి పోయింది.
Also Read : రాజీవ్ హంతకుల విడుదలపై దావా