Supreme Court : కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి
యూపీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసు
Supreme Court : యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని యూపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు(Supreme Court) . కూల్చి వేతలు అన్నవి ప్రతీకార చర్యలు కావని స్పష్టం చేసింది.
మహ్మద్ ప్రవక్తపై ఇద్దరు భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇందులో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను యూపీ సర్కార్ కూల్చి వేయాలని ఆదేశించింది. దీనిని విపక్షాలు తప్పు పట్టాయి.
దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) ను ఆశ్రయించారు. దీనికి సంబంధించి యూపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అయితే కూల్చి వేతలను నిలిపి వేయాలంటూ కోర్టు యూపీని ఆదేశించ లేదు.
ఇళ్ల కూల్చి వేతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి. అవి ఎప్పటికీ ప్రతీకారం తీర్చుకోలేవని స్పష్టం చేసింది. కూల్చి వేతలపై స్టే ఇవ్వలేం.
కానీ చట్ట పరిధిలో మాత్రమే ఉండాలని స్పష్టం చేయగలమని పేర్కొంది ధర్మాసనం. ఇదిలా ఉండగా చట్ట విరుద్దమైన ఇళ్ల కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమియత్ ఉలమా ఇ హింద్ అనే సంస్థ భారత దేశ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించింది.
దీనిపై విచారించిన కోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కూల్చివేతలు దారుణమని, భయంకరమైనవని బాధితులు పేర్కొన్నారు.
ఇళ్లను ధ్వంసం చేసిన తర్వాత నోటీసులు అందించారని ఆరోపించారు. అయితే చట్టాన్ని అనుసరించి మాత్రమే కూల్చి వేశామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
Also Read : కేంద్రం తీరుపై కాంగ్రెస్ కన్నెర్ర