Supreme Court : ఆర్టిక‌ల్ 370 స‌బ‌బేన‌న్న సుప్రీం

సంచల‌న తీర్పు చెప్పిన ధ‌ర్మాస‌నం

Supreme Court : న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌కు తెర దించుతూ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది సుప్రీంకోర్టు(Supreme Court). సోమ‌వారం భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు 370 ఆర్టిక‌ల్ పై ఆస‌క్తిక‌ర తీర్పు వెలువ‌రించ‌డం క‌ల‌క‌లం రేపింది.

Supreme Court Decision about Article 370

తీర్పును సీజేఐ చ‌దివి వినిపించారు. జ‌మ్మూ కాశ్మీర్ ఈ దేశంలో భాగ‌మేన‌ని పేర్కొంది. కాశ్మీర్ కు సంబంధించి ప్ర‌త్యేక హోదా, సార్వ‌భౌమాధికారం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ముగ్గురు న్యాయ‌మూర్తులు అభ్యంత‌రం తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంలో తాము జోక్యం చేసుకోలేమంటూ చేతులు ఎత్తేసింది ధ‌ర్మాస‌నం.

దేశం విడి పోయిన‌ప్పుడు , కాశ్మీర్ భాగంగా ఉన్న స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌త్యేక‌త‌లు క‌ల్పించ లేద‌ని గుర్తు చేసింది ధ‌ర్మాస‌నం. ఇత‌ర రాష్ట్రాల‌కు ఎలాంటి ప‌రిమితులు, సౌక‌ర్యాలు ఉంటాయో కాశ్మీర్ కు కూడా వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం స‌బ‌బేన‌ని అభిప్రాయ‌ప‌డింది. 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు స‌బ‌బేన‌ని , ఇది రాజ్యాంగ బద్ద‌మేన‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం.

Also Read : Prakash Raj : కేసీఆర్ కు ప్ర‌కాశ్ రాజ్ ప‌రామ‌ర్శ

Leave A Reply

Your Email Id will not be published!