Tammineni Sitaram : ఆర్కే రాజీనామాను ఆమోదించ‌లేం

ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం

Tammineni Sitaram : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ఉన్న‌ట్టుండి కోలుకోలేని షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీకి, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే త‌ను పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Tammineni Sitaram Comment

ఈ మేర‌కు స్పీక‌ర్ ఫార్మాట్ లో తాను రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు. అసెంబ్లీలో స్పీక‌ర్ లేక పోవ‌డంతో ఓఎస్డీకు త‌న రిజైన్ చేసిన ప‌త్రాన్ని అంద‌జేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి. ఆయ‌న రాజీనామా చేసిన విష‌యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం(Tammineni Sitaram).

ఓఎస్డీ ద్వారా ఇప్పుడే స‌మాచారం అందుకున్నాన‌ని చెప్పారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశార‌న్న దాని గురించి త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఆయ‌న‌తో వ్య‌క్తిగ‌తంగా తాను మాట్లాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఆర్కే రాజీనామా ఇచ్చినంత మాత్రాన అది రాజీనామా కింద ఆమోదించ లేమ‌న్నారు. ఆ రాజీనామా రాజ్యాంగ బద్దంగా ఉందో లేదో చూసేంత దాకా దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేమ‌న్నారు. ఆర్కేకు స‌ముచిత స్థానం ఇవ్వ‌లేక పోవ‌డం వ‌ల్ల‌నే రాజీనామా చేశార‌న్న‌ది పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు.

Also Read : Supreme Court : ఆర్టిక‌ల్ 370 స‌బ‌బేన‌న్న సుప్రీం

Leave A Reply

Your Email Id will not be published!