Kamareddy MLA Comment : సైలంట్ కిల్ల‌ర్ టార్చ్ బేర‌ర్

కాటిప‌ల్లినా రెడ్డినా మ‌జాకా

Kamareddy MLA : ఎవ‌రీ సైలంట్ కిల్ల‌ర్ అనుకుంటున్నారా. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఏకైక వ్య‌క్తి. ఆయ‌న ఎవ‌రో కాదు మాజీ ముఖ్య‌మంత్రినే కాదు ప్ర‌స్తుతం కొత్త‌గా కొలువు తీరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన ఘ‌నుడు. ఆయ‌నే భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కాటిప‌ల్లి వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి(Venkata Ramana Reddy). ఒక ర‌కంగా చెప్పాలంటే ఎంతో మంది క‌మ‌ల‌నాథుల‌ను దాటుకుని త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు. ఇంత‌లా షాక్ ఇవ్వ‌డం వెనుక ఉన్న రెడ్డికి ఉన్న శ‌క్తి ఏమిటి. తెలుసు కోవాల‌ని ఎవ‌రికైనా ఎందుకు ఉండ‌దు. దేశంలోని 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. బీజేపీ మూడు రాష్ట్రాల‌లో కొలువు తీరితే మిజోరంలో ప్ర‌తిప‌క్ష పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సార‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా కొలువు తీరింది. ఇదంతా ప‌క్క‌న పెడితే ఎన్నిక‌లు ముగిసినా ఇంకా సంచ‌ల‌నంగా మారుతూనే ఉన్నారు వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి.

Kamareddy MLA Comments Viral

ఒక సామాన్యుడిగా ఉంటూనే అసాధార‌ణ‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ఇక్క‌డ ఇద్ద‌రు ఉద్దండులు, ప్ర‌ధాన పార్టీల‌కు బాధ్యులైన వారు బ‌రిలో నిలిచారు. కానీ జ‌నం మాజీ సీఎం కేసీఆర్ ను, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డిని కాదు పొమ్మన్నారు. కామారెడ్డి(Kamareddy) ప్ర‌జ‌లు చ‌రిత్రాత్మ‌క‌మైన తీర్పు చెప్పారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో అన్ని పార్టీలు ప్ర‌లోభాల‌కు గురి చేశాయి. అందినంత మేర డ‌బ్బులు వెద‌జ‌ల్లాయి. మ‌ద్యాన్ని ఏరులై పారించారు. న‌యానో భ‌యానో బెదిరింపుల‌కు గురి చేశారు. అయినా ఎక్క‌డా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు లొంగ‌లేదు. చివ‌రి దాకా కాటిప‌ల్లి వెంక‌ట ర‌మ‌ణా రెడ్డిని ఎవ‌రూ ప‌ట్టించు కోలేదు. రేవంత్ , కేసీఆర్ ల‌పైనే రాష్ట్ర‌, జాతీయ మీడియా మొత్తం ఆ ఇద్ద‌రు ముఖ్య నేత‌ల‌పై ఫోక‌స్ పెట్టాయి. చివ‌ర‌కు ఫ‌లితాలు వ‌చ్చాక చెంప ఛెళ్లుమ‌నిపించేలా తీర్పు చెప్పారు . కేసీఆర్ పై 6,741 కోట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు. కేసీఆర్ ను ఓడిస్తానంటూ బీరాలు ప‌లికిన రేవంత్ రెడ్డి కోడంగ‌ల్ లో గెలుపొంద‌గా కామారెడ్డిలో బోల్తా ప‌డ్డాడు. మూడో స్థానానికే ప‌రిమితం అయ్యాడు.

కాటిప‌ల్లి వెంక‌ట ర‌మ‌ణా రెడ్డికి 66,652 ఓట్లు రాగా కేసీఆర్ కు 59,911 ఓట్లు వ‌చ్చాయి. రేవంత్ రెడ్డికి 54,916 కోట్లు రావ‌డంతో ఆయ‌న మూడో స్థానానికి ప‌రిమితం అయ్యారు. దీంతో దేశం యావ‌త్తు ఒక్క‌సారిగా ఎవ‌రీ కాటిప‌ల్లి అంటూ విస్తు పోయింది. ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారి పోయారు. కాటిప‌ల్లి స్వ‌స్థ‌లం కామారెడ్డి(Kamareddy) ప‌ట్ట‌ణం. ఇంట‌ర్ వ‌ర‌కు చదివారు. ప‌లు వ్యాపారాలు చేప‌ట్టారు. ఆర్థికంగా బ‌ల‌ప‌డిన త‌ర్వాత బీజేపీలో చేరారు. త‌ను సంపాదించిన దాంట్లోంచి భారీ ఎత్తున ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు చేశారు.

దాన ధ‌ర్మాలు చేయ‌డంలో, ఆప‌ద‌లో ఆదుకోవ‌డంలో త‌న‌ను మించిన వారు లేర‌న్న ప్రచారం ఉంది. అంతే కాదు పార్టీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోను కాద‌ని త‌ను స్వంతంగా హామీలు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం, ఇద్ద‌రు ఉద్దండ నేత‌ల‌కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో కాటిప‌ల్లి లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు. సీఎం, మాజీ సీఎంల‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టాడు. సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయాడు. మొత్తంగా జ‌నం తాము కోరుకున్న నాయ‌కుడికే ప‌ట్టం క‌ట్టారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయితే, వారిని ప‌ట్టించుకుంటే గెలిపిస్తార‌ని కాటిప‌ల్లి నుంచి చూస్తే తెలుస్తుంది.

Also Read : KCR Comment : ఫ‌లించ‌ని యాగం అధికారానికి దూరం

Leave A Reply

Your Email Id will not be published!