Supreme Court : రాజీవ్ హ‌త్య కేసులో కీల‌క తీర్పు

దోషుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మం

Supreme Court : గ‌త కొంత కాలంగా నాన్చుతూ వ‌చ్చిన మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో కీల‌క తీర్పు వెలువ‌రించింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయస్థానం(Supreme Court).

ఈ మేర‌కు ఈ కేసులో 30 ఏళ్ల‌కు పైగా జైలు శిక్ష అనుభ‌విస్తున్న దోషి ఏ.జి. పేర‌రివాళ‌న్ ను విడుద‌ల చేయాల‌ని జ‌స్టిస్ ఎల్. నాగేశ్వ‌ర్ రావు, బీ.ఆర్. గ‌వాయి, ఏఎస్ బోప‌న్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

ఇందులో భాగంగా బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తీర్పున‌కు సంబంధించి త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రివ‌ర్గం కూడా అంగీకారం తెలిపింద‌ని,

ఇక రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 142 ప్ర‌కారం పేరరివాళ‌న్ రిలీజ్ చేయ‌డంలో త‌ప్పేమీ లేద‌ని అభిప్రాయ‌ప‌డింది.

కాగా పేర‌రివాళ‌న్ విడుద‌ల‌తో ఈ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభ‌విస్తున్న న‌ళిని, ఆమె భ‌ర్త మురుగ‌న్ స‌హా ఇత‌ర దోషుల విడుద‌ల‌కు కూడా మార్గం సుగ‌మ‌మైంది.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. భార‌త దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీ హ‌త్య కేసు. మాన‌వ బాంబు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న మే 21, 1991ల‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో శ్రీ పెరంబుదూర్ లో ఎన్నిక‌ల ర్యాలీ చేపడుతున్న స‌మ‌యంలో ధ‌ను అనే మ‌హిళ ఆత్మాహుతికి పాల్ప‌డింది.

ఈ ఘ‌ట‌న‌లో రాజీవ్ గాంధీ తో పాటు ప‌లువురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. గుర్తించ లేని రీతిలో శ‌రీర శ‌క‌లాలు ప‌డి ఉన్నాయి.

ఈ హ‌త్య కేసులో పేర‌రివాళ‌న్ తో పాటు దోషులుగా తేలిన మురుగ‌న్, భార్య న‌ళిని, సంత‌న్, ప‌యాస్ , జ‌య‌కుమార్, ర‌విచంద్ర‌న్ ల‌కు 

కోర్టు(Supreme Court) జీవిత ఖైదు విధించింది.

వీరిని విడుద‌ల చేయాలంటూ త‌మిళ‌నాడు స‌ర్కార్ తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) లో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Also Read : పేద‌ల ముంగిట వైద్యం – ఎంకే స్టాలిన్

Leave A Reply

Your Email Id will not be published!