Supreme Court Rahul Comment : సుప్రీం తీర్పు శిరోధార్యం
రాహుల్ గాంధీకి ఉపశమనం
Supreme Court Rahul Comment : భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం జూలు విదిల్చింది. కీలకమైన తీర్పును వెలువరించింది. ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని దేశ ప్రజలకు ఓ నమ్మకాన్ని కలిగించింది. ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరటను ఇచ్చింది. 2019లో ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని ఉద్దేశించిన పరువు నష్టం కేసు విషయంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి 2 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.
దీనిపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఆపై తనకు బెయిల్ ఇవ్వాలని, స్టే మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. కానీ హైకోర్టు ధర్మాసనం ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నతమైన పదవిలో ఉన్న వారు ఆదర్శ ప్రాయంగా ఉండాలని , చులకన చేసి మాట్లాడటం మంచిది కాదని అది రాహుల్ గాంధీకి వర్తిస్తుంది..ప్రధాని మోదీకి కూడా అని పేర్కొంది. ఇదే సమయంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది.
Supreme Court Rahul Comment Viral
దీనిని ఆధారంగా చేసుకుని లోక్ సభ స్పీకర్ వెంటనే రాహుల్ గాంధీ వాయనాడు ఎంపీగా ఉండేందుకు అర్హుడు కాడంటూ రూలింగ్ ఇచ్చారు. దీంతో ఆయన ఎంపీ అర్హతను కోల్పోయారు. దీనిపై పెద్ద ఎత్తున విపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నాయి. అయినా కోర్టు, పార్లమెంట్ స్పీకర్ వినిపించు కోలేదు. దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు రాహుల్ గాంధీ. ఆపై ఆయన సంయమనం పాటిస్తూ వచ్చారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. ఈ సందర్బంగా సంచలన తీర్పు వెలువరించింది(Supreme Court Rahul Comment). తీర్పును అమలు చేయకుండా స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇది ఒక రకంగా రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించే తీర్పుగా పేర్కొనడంలో తప్పు లేదు. పరువు నష్టం కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి భారీ ఊరట కలిగించింది. అంతే కాదు ఆ పార్టీకి తీపి కబురు చెప్నిట్లయింది. జస్టిస్ లు బీఆర్ గవాయ్ , జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఉత్తర్వు పరిణామాలు విస్తృతమైనవి. ప్రజా జీవితంలో కొనసాగే పిటిషనర్ల హక్కుపైనే కాకుండా ఆయనను ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుంది.ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చూపనందున తుది తీర్పు పెండింగో ఉండడం వల్ల దోషిగా నిర్ధారించే ఉత్తర్వును నిలిపి వేయాలని స్పష్టం చేసింది. మొత్తంగా విద్వేష పూరిత రాజకీయాలకు, మాటలకు , వ్యాఖ్యలకు , దూషణలకు ఈ తీర్పు ఒక పాఠం లాంటిదని చెప్పక తప్పదు.
Also Read : RTC Bill Governor : ఆర్టీసీ బిల్లును ఆమోదించని గవర్నర్