MLC Kavitha SC : క‌విత‌కు షాక్ ‘సుప్రీం’ ఝ‌ల‌క్

ఈడీ విచార‌ణ‌కు హాజరు కావాల్సిందే

MLC Kavitha SC : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు బిగ్ షాక్ త‌గిలింది(MLC Kavitha SC). ఒక మ‌హిళ‌ను ఈడీ విచార‌ణ‌కు పిల‌వ కూడ‌దంటూ తాను హాజ‌రు కాకుండా ఉండేలా చూడాల‌ని కోరుతూ ఎమ్మెల్సీ క‌విత భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఒప్పుకోలేదు.

ఆమెకు కోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచార‌ణ‌కు పిల‌వ‌కుండా స్టే విధించాల‌ని కోర‌డం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి మార్చి 24వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. దీంతో మార్చి 16న ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు క‌విత ఆడిట‌ర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసు జారీ చేసింది. మ‌రో వైపు వ్యాపార‌వేత్త అరుణ్ రామ‌చంద్ర పిళ్లైని మూడు రోజులు క‌స్ట‌డీ తీసుకుంది. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి ఇప్ప‌టికే మార్చి 11న ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌రైంది.

ఉద‌యం 11 గంట‌ల‌కు వెళ్లిన ఎమ్మెల్సీ క‌విత రాత్రి 8.05 నిమిషాల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాదాపు 9 గంట‌ల‌కు పైగా క‌విత‌ను విచారించ‌డం క‌ల‌క‌లం రేపింది. మ‌రో వైపు బుధ‌వారం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై స‌మావేశం ఏర్పాటు చేసింది క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

కాగా ఈడీ ఎదుట హాజ‌ర‌య్యేందుకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది.

Also Read : దొంగ‌ల‌ను వ‌దిలేసి మా వాళ్ల‌పై కేసులా

Leave A Reply

Your Email Id will not be published!