Supreme Court : జర్నలిస్ట్ సిద్దిక్ బెయిల్ పై యూపీకి నోటీసు
జారీ చేసిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ బెయిల్ పిటిషన్ పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ , ఎస్. రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం(Supreme Court) సెప్టెంబర్ 9న తుది తీర్పును ఖరారు చేసింది. కేరళకు చెందిన సిద్దిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ కు వెళ్లే మార్గంలో గత ఏడాది అరెస్ట్ కు గురయ్యాడు.
అక్కడ ఒక దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించింది. ఈ ఘటన 2020 అక్టోబర్ లో చోటు చేసుకుంది. జర్నలిస్ట్ కప్పన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం యూపీ ప్రభుత్వం నుండి స్పందన కోరింది.
ఇదిలా ఉండగా హత్రాస్ కుట్ర కేసుఏలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ ) చట్టం కింద కేసు నమోదు చేశారు. సిద్దిక్ కప్పన్ బెయిల్ దరఖాస్తును అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఈ నెల ప్రారంభంలో తిరస్కరించింది.
కాగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్న నలుగురిపై ఇండియన్ పీనల్ కోడ్ , యుఏపీఏలోని వివిధ నిబంధణల ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలైంది.
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నిధులు సమకూర్చినట్లు పీఎఫ్ఐ గతంలో ఆరోపణలు ఎదుర్కొంది.
మరో వైపు హత్రాస్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులు ఆరోపించారు.
Also Read : ఎవరీ సిద్దిక్ కప్పన్..ఏమిటా కథ