Supreme Court : కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీంకోర్టు

రాజ ద్రోహం చ‌ట్టం ఇంకెంత కాలం

Supreme Court  : రాజ ద్రోహం చ‌ట్టంపై విచార‌ణ కొనసాగుతోంది సుప్రీంకోర్టులో(Supreme Court). దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతోంది. ఆనాడు బ్రిటీష్ పాల‌కులు శాంతియుతంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మ‌హాత్మా గాంధీ, తిల‌క్, త‌దిత‌ర నాయ‌కుల నోరు మూయించేందుకు వారిని జైళ్ల‌ల్లో పెట్టేందుకు రాజ ద్రోహం చ‌ట్టం తీసుకు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది సుప్రీంకోర్టు. రాజ ద్రోహం చ‌ట్టాన్ని పునః ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకొనేంత ద‌కాఆ ఆ చ‌ట్టం కింద కేసుల న‌మోదును నిలిపి వేస్తారా అంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది.

ఇప్ప‌టికే న‌మోదు చేసిన కేసుల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నారంటూ ప్ర‌శ్నించింది సుప్రీంకోర్టు(Supreme Court). దీనిపై వెంట‌నే స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించింది. ఐసీసీ 12ఏ రాజ‌ద్రోహంను పునః స‌మీక్షిస్తామంటూ కేంద్ర స‌ర్కార్ సుప్రీంకోర్టుకు అఫిడ‌విట్ స‌మ‌ర్పించింది.

ఇన్నేళ్ల‌యినా ఎందుకు కొన‌సాగిస్తున్నారో త‌మ‌కు అర్థం కావడం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌జాస్వామ్య‌యుత దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ బ‌తికే, ప్ర‌శ్నించే హ‌క్కు ఉంటుంది. రాజ ద్రోహం చ‌ట్టం పేరుతో వేలాది మందిపై కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.

కాగా కేంద్ర స‌ర్కార్ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ను ప‌రిశీలించింది ధ‌ర్మాస‌నం . ఈ చ‌ట్టానికి సంబంధించి పునః స‌మీక్ష చేసేందుకు కేంద్రానికి ప‌ర్మిష‌న్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

కాగా దీనికి ఎంత కాలం ప‌డుతుంద‌ని మ‌రోసారి నిల‌దీసింది. ప్ర‌భుత్వంతో సంప్ర‌దించిన త‌ర్వాత క‌చ్చిత‌మైన తేదీ, స‌మ‌యం తెలియ చేస్తాన‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వెల్ల‌డించారు.

ఈ మేర‌కు ధ‌ర్మాస‌నం ఓకే చెప్పింది. మొత్తంగా కేంద్రం అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఒకింత సుప్రీంకోర్టు అసహ‌నం వ్య‌క్తం చేసింది. విచిత్రం ఏమిటంటే 2015-2020 మ‌ధ్య కాలంలో దేశంలో 356 రాజ ద్రోహం కేసులు న‌మోద‌య్యాయి. ఈ చ‌ట్టం కింద 548 మందిని అరెస్ట్ చేశారు.

Also Read : క‌నిపిస్తే కాల్చేయండి – శ్రీ‌లంక చీఫ్

Leave A Reply

Your Email Id will not be published!