Supreme Court : మీడియా వన్ ఛానెల్ నిషేధం చెల్లదు
ప్రజాస్వామ్యానికి పత్రికా వ్యవస్థ మూలం
Supreme Court : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. విమర్శలతో కూడిన అభిప్రాయాలు దేశ భద్రతకు భంగం కలిగించవంటూ స్పష్టం చేసింది. ప్రజల హక్కులను కాలరాసేందుకు జాతీయ భద్రతను లేవనెత్తలేము..ఈ కేసులో హోం మంత్రిత్వ శాఖ దానిని అత్యద్భుతంగా ప్రస్తావించిందంటూ పేర్కొంది కోర్టు(Supreme Court).
జాతీయ భద్రత దృష్ట్యా మలయాళ వార్తా ఛానెల్ మీడియా వన్ ప్రసారాలను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. అంతే కాదు దానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది.
ప్రభుత్వ విధానాలు, చర్యలపై ఛానెల్ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక లేదా స్థాపనకు వ్యతిరేకమైనదిగా భావించ లేమని పేర్కొంది. శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి స్వతంత్ర ప్రతికా, ప్రసార వ్యవస్థ అత్యంత అవసరమని కోర్టు కుండ బద్దలు కొట్టింది.
సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం ఛానెల్ ప్రసార లైసెన్స్ ను పునరుద్దరించేందుకు కేంద్ర సమాచార శాఖ నిరాకరించింది. దీనిని తీవ్రంగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు(Supreme Court). కేంద్ర హోం మంత్రిత శాఖను నిలదీసింది. ఏ ప్రాతిపదికన దానిని నిలిపి వేశారో చెప్పాలని కోరింది. మీడియా వన్ పై ప్రసార నిషేధాన్ని విధించే నిర్ణయాన్ని సమర్థించేందుకు ఎలాంటి వాస్తవాలు లేదా సాక్ష్యాలను చూపడంలో కేంద్రం విఫలమైందని న్యాయమూర్తులు తెలిపారు.
Also Read : దేశంలో కొత్తగా 4,435 కరోనా కేసులు