Supreme Court : ఉద్ద‌వ్ ఠాక్రేకు షాక్ షిండేకు ఊర‌ట

ఆగ‌స్టు 1కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court : న్యాయం గెలుస్తుంద‌ని, ధ‌ర్మం త‌న వైపు ఉందని ప్ర‌గాఢ విశ్వాసంతో ఉన్న శివ‌సేన పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు కోలుకోలేని షాక్ త‌గిలింది.

ఆయ‌న‌పై తిరుగుబాటు జెండా ఎగుర‌వేసి ఏకంగా సీఎం పీఠంపై కొలువు తీరిన మాస్ లీడ‌ర్ ఏక్ నాథ్ షిండేకు ఊర‌ట ల‌భించింది. పార్టీపై ఎవ‌రికి ప‌వ‌ర్ ఉండాల‌నే దానిపై ఠాక్రే, షిండేలు ఇద్ద‌రూ క‌లిసి సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్ర‌యించారు.

ఈ ఇద్ద‌రికి సంబంధించిన కేసును బుధ‌వారం భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం విచార‌ణ చేప‌ట్టింది. మ‌రాఠా వ్యాప్తంగా ఎలాంటి తీర్పు వ‌స్తుందోన‌ని ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన వారంద‌రి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది కోర్టు.

ఈ మేర‌కు పూర్తి విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం కేసును వ‌చ్చే ఆగ‌స్టు నెల 1కి వాయిదా వేసింది. ఆ రోజు లోపు సీఎం ఏక్ నాథ్ షిండే పూర్తి ఆధారాల‌తో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

తుది తీర్పు వెలువ‌రించేంత వ‌ర‌కు ఎమ్మెల్యేల అన‌ర్హ‌త విష‌యానికి సంబంధించి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది కోర్టు. తాము చెప్పేంత వ‌ర‌కు వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ సూచించింది.

దీంతో ఎంతో న‌మ్మ‌కంతో ఉన్న ఉద్ద‌వ్ ఠాక్రే కు పూర్తి నిరాశ క‌లిగించే వార్త ఇది. ఈ కేసును భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం.

వీటి విచార‌ణ‌కు విస్తృత ధ‌ర్మాస‌నం అవ‌స‌రం అవుతుంద‌ని తాను బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. షిండే త‌ర‌పున క‌పిల్ సిబ‌ల్ వాదిస్తే ఉద్ద‌వ్ ఠాక్రే త‌ర‌పున హ‌రీష్ సాల్వే వాదించారు.

Also Read : రాహుల్ గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!