Supreme Court : దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మకంగా మారిన జహంగీర్ పురిలో కూల్చివేత కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) నిలిపి వేసింది. తొలగింపు డ్రైవ్ పై ప్రస్తుతానికి స్టేటస్ కో (యథాతథ స్థితి)ని కోర్టు విధించింది.
విచారణను 21న ఈ అంశంపై విచారణ జరుపుతుంది. శనివారం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా మత ఘర్షణలు చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది.
తొలగింపు డ్రైవ్ పై ప్రస్తుతానికి స్టేటస్ కో కోర్టు(Supreme Court) ఆదేశించింది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి తలెత్తకుండా భారీ పోలీసు ఉనికి మధ్య బీజేపీ నియంత్రణలో ఉన్న నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు 9 బుల్ డోజర్లు ప్రవేశించాయి.
నిర్మాణాలను ధ్వసం చేయడం ప్రారంభించడంతో కోర్టు ఆదేశించింది. ఢిల్లీకి చెందిన భారతీయ జనతా పార్టీ చీఫ ఆదేశ్ గుప్తా మేయర్ కు లేఖ రాశారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చి వేయాలని కోరారు.
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ దీనిని రోటిన్ కార్యక్రమంగా కొట్టి పారేశారు. బీజేపీ లేఖ రాయడం, ఆక్రమణలు కూల్చి వేయడం రాజకీయ ఉద్దేశాలపై ప్రశ్నలను ప్రేరేపించింది.
బుధవారం ఉదయం ప్రత్యేక పోలీస్ కమిషనర్ దేపేంద్ర పాఠక్ , ఇతర సీనియర్ అధికారులు తొలగింపు డ్రైవ్ కు ముందు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇందు కోసం 400 మంది పోలీసు సిబ్బందిని ఇవ్వాలని కోరింది.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ , హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్ మెంట్ , ఇతరులతో కూడిన ఉమ్మడి ఆక్రమణ నిరోధక కార్యక్రమంలో జహంగీర్ పురిలో షెడ్యూల్ చేశామని మున్సిపల్ కార్పొరేషన్ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది.
Also Read : ఢిల్లీ హింసాకాండలో ఐదుగురిపై ‘నాసా’