Supreme Court : ఫిఫాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు
సుప్రీంకోర్టుకు భారత ఫుట్ బాల్ సంస్థ
Supreme Court : ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫుట్ బాల్ సంస్థ ఫిఫా కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత్ కు. ఈ మేరకు మూడో ప్రభావిత ప్రమేయం కారణంగా నిషేధం విధించింది. దీనిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు(Supreme Court).
ఈ ఏడాది భారత్ లో అండర్ -17 ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనుంది. దీని వల్ల భారత్ కు మచ్చ ఏర్పడుతుందని వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.
ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఫిఫా చట్టాలను ఉల్లంఘించందంటూ ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్ ) ను సస్పెండ్ చేసింది.
విచారణ చేపట్టిన కోర్టుకు ఫుట్ బాల్ సంఘం అనేక ప్రతిపాదనలు చేసింది. ఫిఫాతో కేంద్రం జరిపిన చర్చల ఆధారంగా ఈ ప్రతిపాదనలు వచ్చాయి.
సోమవారం జరిగిన విచారణలో ఏఐఎఫ్ఎఫ్ దాని పరిపాలన , నిర్వహణను సక్రమంగా ఎన్నుకోబడిన సంస్థ ద్వారా నిర్వహించాలని ప్రతిపాదించింది.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో పక్షం ద్వారా ఉండదని , అందువల్ల సీఓఏ పదవీ కాలం ముగియాలని ప్రతిపాదించింది.
ఏఐఎఫ్ఎఫ్ సస్పెన్షన్ మొత్తం దేశానికి , ఫుట్ బాల్ ఆటగాళ్లందరికీ శాపం అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పదవీ కాలాన్నీ ముగించాలని, ఆల్ ఇండియా ఫుట్ బాల్ రోజూ వారీ నిర్వహణను తాత్కాలిక సెక్రటరీ జనరల్ నేతృత్వంలో ఏఐఎఫ్ఎఫ్ పరిపాలన చూసుకోవాలని కేంద్రం కోర్టును కోరింది.
ప్రస్తుతం ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ మధ్య నెలకొన్న వివాదాన్ని ధర్మాసనం స్పందించింది.
Also Read : పూల దండలు కాదు ఉరితాళ్లే కరెక్ట్