Supreme Court : ఎలోక్టరల్ బాండ్లపై సుప్రీం విచారణ
అక్టోబర్ 31, నవంబర్ 1న తుది తీర్పు
Supreme Court : న్యూఢిల్లీ – మోదీ సంకీర్ణ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎలోక్టరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందుకు సంబంధించి కీలకమైన నిర్ణయం ప్రకటించింది మంగళవారం కోర్టు. దేశానికి సంబంధించి ఎవరైనా , ఏ సంస్థకు చెందిన వారైనా ఇందులో డబ్బులు పెట్టవచ్చు. వీటిపై ఎలాంటి విచారణ చేపట్టడం అనేది ఉండదు. ఇది దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఉన్న సమయంలో దీనిని తీసుకు వచ్చారు.
Supreme Court Hearing Electoral Bonds Case
ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఆయా పార్టీలకు ఎలోక్టరల్ బాండ్ల రూపేణా జమ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నల్ల డబ్బు, అక్రమంగా సంపాదించిన వ్యాపారవేత్తలు, సంస్థలు, కంపెనీలు గంప గుత్తగా రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా తిరిగి పార్టీలకు ఇవ్వడం వల్ల అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా ఎలక్టోరల్ బాండ్ల జారీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిలిపి వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. మొత్తం పిటిషన్లపై చివరగా అక్టోబర్ 31తో పాటు నవంబర్ 1న తుది తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
Also Read : AP CM YS Jagan : కృష్ణా జలాలపై జగన్ సమీక్ష
