Satyendar Jain ED : జైన్ పిటిషన్ పై ఈడీకి సుప్రీం నోటీస్
విచారణకు ఓకే చెప్పిన ధర్మాసనం
Satyendar Jain ED : తన కేసుకు సంబంధించి గతంలో ఉన్న జడ్జీని కాకుండా కొత్త న్యాయమూర్తిని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జైన్(Satyendar Jain ED) వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నోటీసులు జారీ చేసింది.
అంతే కాకుండా జైన్ పిటిషన్ ను విచారించేందుకు అంగీకరించింది. మనీ లాండరింగ్ కేసును కొత్త న్యాయమూర్తికి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు మంత్రి సత్యేందర్ జైన్. ఈ పిటిషన్ ను పరిశీలించింది ధర్మాసనం ఈ మేరకు ఈడీకి నోటీసు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతకు ముందు తనపై ఉన్న కేసును కొత్త న్యాయమూర్తికి బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. విచారణ సందర్బంగా జస్టిస్ యోగేష్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. పిటిషన్ ను ఎందుకు తిరస్కరించారో వివరించారు.
పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తిన సమయంలో జడ్జీలను మార్చడం సర్వ సాధారణమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విచారణ సంస్థ చేసిన అభ్యర్థన మేరకు సెప్టెంబర్ 23న ట్రయల్ కోర్టు ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ నుండి ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ కు బదిలీ చేసిన తర్వాత ఇది జరిగింది.
చట్టం అమల్లోకి రాక ముందే నమోదు చేసిన లావాదేవీల కోసం అధికారులు జప్తు ప్రక్రియను ప్రారంభించడం లేదా కొనసాగించడం సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read : ద్వేషపూరిత ప్రసంగాలు దేశానికి ప్రమాదం