Supriya Shrinate : స్మృతీ ఇరానీపై సుప్రియా సీరియ‌స్

రాహుల్ గాంధీ పై ఆరోప‌ణ‌లు త‌ప్పు

Supriya Shrinate Smriti : కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా చైర్ ప‌ర్స‌న్ , టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిట‌ర్ సుప్రియా శ్రీ‌నాటే(Supriya Shrinate Smriti) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై నిప్పులు చెరిగారు. ఆమె కేంద్ర మంత్రిగా ప‌ని చేయ‌డం లేద‌ని కేవ‌లం రాహుల్ గాంధీని తిట్టడం ఒక ప‌నిగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాహుల్ గాంధీ ట్రోల్ మంత్రిత్వ శాఖ‌కు స్మృతీ ఇరానీ మంత్రిగా ఉన్నారంటూ మండిప‌డ్డారు సుప్రియా శ్రీ‌నాటే.

ప్ర‌స్తుతం త‌మ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీని తిట్టే శాఖ‌లో మ‌రో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వ‌చ్చి చేరారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బుధ‌వారం న్యూఢిల్లీలో సుప్రియా శ్రీ‌నాటే(Supriya Shrinate) మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులుగా వీళ్లు ఉన్నార‌న్న విష‌యం ప్ర‌జ‌లు ఏనాడో మ‌రిచి పోయార‌ని అన్నారు. దేశంలో ఎన్నో స‌మ‌స్య‌లు పేరుకు పోయాయ‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వాటి గురించి ప‌ట్టించుకునే పాపాన పోలేద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీని ప‌నిగట్టుకుని విమ‌ర్శలు చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నార‌ని ఇలాగే చేస్తూ పోతే త‌మ నాయ‌కుడికి మీరే ప్ర‌చారం క‌ల్పించిన‌ట్ల‌వుతుంద‌ని పేర్కొన్నారు. గుండె మీద చేయి వేసుకుని చెప్ప‌గ‌ల‌రా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక‌టి ఉంద‌ని అని ప్ర‌శ్నించారు సుప్రియా శ్రీ‌నాటే. ఇక‌నైనా మోదీ ప్ర‌భుత్వం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. ఆరోప‌ణ‌లు మానేసి ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించేలా చూడాల‌ని హిత‌వు ప‌లికారు.

Also Read : డిఫెన్స్ ప‌రిక‌రాల కాంట్రాక్టు అదానీకి

Leave A Reply

Your Email Id will not be published!