Supriya Sule : దేశ్ ముఖ్ ఫ్యామిలీపై 109 సార్లు దాడులు
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కామెంట్స్
Supriya Sule : రాజకీయ పార్టీలను టార్గెట్ గా చేసుకోవడం మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పనిగా పెట్టుకుందని ఆరోపించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. ఆమె బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తమ పార్టీకి చెందిన మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కుటుంబంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏకంగా 109 సార్లు దాడులకు పాల్పడిందని ఆరోపించారు.
బహుషా దేశంలో ఎక్కడా జరగలేదని, ఏ నాయకుడిపై ఇన్నిసార్లు సోదాలు చేసిన పాపాన పోలేదని పేర్కొన్నారు. సోమవారం సుప్రియా సూలే(Supriya Sule) మాట్లాడారు. అనిల్ దేశ్ ముఖ్ కుటుంబంపై చేసిన దాడులు ఒక రకంగా వరల్డ్ రికార్డ్ గా ఆమె అభివర్ణించారు.
ఇదిలా ఉండగా 72 ఏళ్ల వయస్సు ఉన్న దేశ్ ముఖ్ ను మనీ లాండరింగ్ ఆరోపణలపై గత ఏడాది నవంబర్ 2న ఈడీ , అవినీతి ఆరోపణలపై ఏప్రిల్ 4న సీబీఐ అరెస్ట్ చేసింది.
జూన్ 2న ఆయనపై సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసింది. ఈ సందర్బంగా ఎన్సీపీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సుప్రియా సూలే తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు.
తనకు మోడీ అంటే కోపం లేదన్నారు. కానీ ఏం జరుగుతుందో మాత్రం అన్నది పీఎంకు తెలుసన్నారు. ఆయనకు తెలియకుండా ఇలాంటి దాడులు జరిగే చాన్స్ లేదని ఆరోపించారు.
బీజేపీయేతర వ్యక్తులు, వ్యవస్థలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు, కంపెనీలు , ప్రజా ప్రతినిధులను కేంద్ర సర్కార్ లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
లొంగి పోతే సరే లేకపోతే కేసుల పేరుతో అరెస్ట్ చేయడం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు సుప్రియా సూలే(Supriya Sule) . ఈ విషయంపై తాను పార్లమెంట్ లో లేవదీస్తానని చెప్పారు.
Also Read : సిద్దూ హత్య కేసులో 8 మంది గుర్తింపు