Supriya Sule : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఎన్నికలు జరిగితే బెటర్ అని అన్నారు.
ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా గత నాలుగు నెలలుగా ఎలాంటి పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలు పెరగలేదు. ఎన్నికల పర్వం ముగియగానే వీటి ధరలు పెరగడం మొదలు పెట్టాయి.
నిన్న , ఇవాళ కంటిన్యూగా ఆయిల్, గ్యాస్ కంపెనీలు పెంచడం ప్రారంభించాయి. సదరు కంపెనీలను నియంత్రించాల్సిన మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule )తప్పు పట్టారు.
దీన్ని బట్టి చూస్తే ప్రతి నెలా ఎన్నికలు వస్తే బావుంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్ముకుంటూ పోతున్న మోదీపై తీరుపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.
పదే పదే ధరల పెంపుదల పెంచడం వల్ల ప్రజలపై పెను భారం పడుతుందని మండిపడ్డారు. లీటర్ పెట్రోల్ పై 95 పైసలు, డీజిల్ పై లీటర్ కు 80 పైసల చొప్పున పెంచడాన్ని తప్పు పట్టారు.
ఇవాళ లోక్ సభ సాక్షిగా సుప్రియా సూలే (Supriya Sule )కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగకుండా ఉండేందుకు ప్రతి నెలా ఎన్నికలు నిర్వహించాలని సెటైర్ విసిరారు.
ప్రతిపక్షాలు ధరల పెరుగుదలను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీల సభ్యులు బాయ్ కాట్ చేశారు.
Also Read : ఈడీ దాడులపై శివసేన సీరియస్