Supriya Sule : కేంద్ర సర్కార్ పై సుప్రియా సూలే ఫైర్
ఎన్సీపీ ఎంపీ సంచలన కామెంట్స్
Supriya Sule : ప్రవక్త వ్యాఖ్యలపై చోటు చేసుకుంటున్న అల్లర్లను, నిరసనలను అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) . జింగోయిజానికి అతీతంగా మాట్లాడాలని పేర్కొన్నారు.
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ , రాజస్థాన్ , మహారాష్ట్ర, జార్ఖండ్ తో సహా దేశంలోని పలు ప్రాంతాలలో నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఇద్దరు ఈ ఘటనలో చని పోయారు.
మరో వైపు యూపీలో బుల్ డోజర్లు రంగంలోకి దిగాయి. ఢిల్లీ జమా మసీదులో ప్రార్థనల తర్వాత నినాదాలు చేసిన నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వరుస నిరసనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుప్రియా సూలే. ఆమె శనివారం మాట్లాడారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇది జింగోయిజానికి మించినదని అన్నారు. ఈ వరుస ఘటనలతో దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోందన్నారు సుప్రియా సూలే. బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రాలలో కూడా రాళ్ల దాడులు జరగడం దారుణమన్నారు.
జమ్మూ, కాశ్మీర్ , ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కావచ్చు. అన్నింట్లో కంట్రోల్ చేయడంలో విఫలమైందని ఆరోపించారు. తరుచూ జరుగుతున్న హింసాత్మక ఘటనలపై దృష్టి సారించాలని హోం మంత్రిత్వ శాఖను సుప్రియో సూలే(Supriya Sule) కోరారు.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అల్లర్లలో 20 మంది గాయపడ్డారు. నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జీని ప్రయోగించారు. టియర్ గ్యాస్ వాడారు. గాల్లోకి కాల్పులు జరిపారు.
బెంగాల్ లోని హౌరా జిల్లాల్లో తాజా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 15 దాకా 144 సెక్షన్ విధించారు. 13 వరకు జిల్లా అంతటా ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.
Also Read : 15న రాష్ట్రపతి ఎన్నికలపై దీదీ సమావేశం