Ashish Mishra Bail : ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో మిశ్రాకు బెయిల్

రైతుల‌ను హ‌త్య చేసిన కేసులో నిందితుడు

Ashish Mishra Bail : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది రైతులపై వాహ‌నం ఎక్కించి చావుకు గురైన కేంద్ర స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు ఆశిష్ మిశ్రా. గ‌తంలో అల‌హాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. ఆయ‌న విడుద‌ల‌ను నిర‌సిస్తూ రైతు సంఘాల నేత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

దీంతో కోర్టు తిరిగి అత‌డిని అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన సిట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రైతులను చంపిన కేసులో ఆశిష్ మిష్రాకు కీల‌క పాత్ర ఉందంటూ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ త‌రుణంలో ఆయ‌న‌కు బెయిల్ మంజూరు కావ‌డం విస్తు పోయేలా చేసింది.

అస‌లు ఈ దేశంలో న్యాయం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని రైతు నాయ‌కుడు రాకేశ్ టికాయ‌త్ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా బుధ‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది అత్యున్న‌త న్యాయ స్థానం. ఈ మేర‌కు ఆశిష్ మిశ్రాకు ఎనిమిది (8) వారాల బెయిల్(Ashish Mishra Bail) పొందాడు.

బెయిల్ పై ఉన్న స‌మ‌యంలో ఆశిష్ మ‌శ్రా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లేదా ఢిల్లీ దాని స‌మీప ప్రాంతాల్లో నివ‌సించ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. వారం లోగా యూపీ వెళ్లి పోవాల‌ని ఆదేశించింది. యూపీలోని ల‌ఖింపూర్ ఖేరిలో 2021న నిర‌స‌న తెలిపిన రైతుల‌పై తానే వాహ‌నం న‌డిపించుకుంటూ వెళ్లాడు.

ఈ ఘ‌ట‌న‌లో రైతుల‌తో పాటు ఓ జ‌ర్న‌లిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఆశిష్ మిశ్రా కానీ ఆయ‌న కుటుంబీకులు కానీ ప్ర‌య‌త్నం చేస్తే బెయిల్ ర‌ద్ద‌వుతుంద‌ని హెచ్చ‌రించింది కోర్టు.

Also Read : రాఖీ సావంత్ ను అరెస్ట్ చేయొద్దు

Leave A Reply

Your Email Id will not be published!