PM Modi : డైమండ్స్ ట్రేడింగ్ హబ్ గా సూరత్ – మోదీ
దేశానికే గర్వ కారణంగా నిలవనున్న నగరం
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వజ్రాలకు సంబంధించి సూరత్ అద్బుతమైన నగరమని పేర్కొన్నారు. సూరత్ సురక్షితమైన అత్యంత అనుకూలమైన డైమండ్ ట్రేడింగ్ హబ్ లలో ఒకటిగా ఆవిర్భవించనుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
గత 20 ఏళ్లుగా సూరత్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నగరానికి ఎయిర్ పోర్ట్ కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు నరేంద్ర మోదీ(PM Modi).
డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్ ) సిటీ ప్రాజెక్టు పూర్తియన తర్వాత ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, ఉపయోగకరమైన డైమండ్ ట్రేడింగ్ హబ్ లలో సూరత్ ఒకటిగా నిలవడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రధాన మంత్రి.
గురువారం ఆయన డ్రీమ్ సిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో సార్లు ఎయిర్ పోర్టు గురించి తెలియ చేసినా ఫలితం కనిపించ లేదన్నారు మోదీ. కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పుడు తమ ప్రభుత్వం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
ఇదిలా ఉండగా రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనుల ఫేజ్ -1 ని , డ్రీమ్ సిటీ ప్రధాన ద్వారాన్ని ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
రూ. 3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. సూరత్ నుంచి విమానాశ్రయానికి రోడ్డు అనుసంధానించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇక్కడి సంస్కృతి, శ్రేయస్సు సూరత్ ఆధునికతను ప్రతిబింబిస్తుందని చెప్పారు నరేంద్ర మోదీ.
Also Read : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 5జీ సేవలు