Suresh Gopi: ఆ పెద్దాయన అప్లికేషన్‌ అందుకే తీసుకోలేదు – కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి

ఆ పెద్దాయన అప్లికేషన్‌ అందుకే తీసుకోలేదు - కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి

Suresh Gopi : ఇటీవల కేరళలో జరిగిన ఓ ర్యాలీలో ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్‌ గోపిని సాయం కోరుతూ ఓ వృద్ధుడు అప్లికేషన్‌ ఇవ్వబోయాడు. కాగా తనకు ఇల్లు కావాలంటూ అతడు ఇచ్చిన అప్లికేషన్‌ పత్రాన్ని మంత్రి తిరస్కరించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సురేశ్‌ గోపిపై (Suresh Gopi) నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రి స్పందించారు. ప్రజాప్రతినిధిగా తాను ఎటువంటి పనులు చేయగలను, ఎటువంటివి చేయలేను అనే విషయాలపై తాను ఎల్లప్పుడూ స్పష్టతతో ఉంటానని అన్నారు.

Suresh Gopi – అసలు ఏం జరిగిందంటే ?

సెప్టెంబర్ 12న త్రిసూర్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి పాల్గొన్నారు. ఆ సమయంలో వేలాయుధన్ అనే వృద్ధుడు ప్రభుత్వం నుంచి తనకు ఇల్లు మంజూరయ్యేలా సాయం చేయాలని అభ్యర్థిస్తూ… కేంద్ర మంత్రికి అప్లికేషన్‌ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే వృద్ధుడి అప్లికేషన్‌ను తీసుకోవడానికి సురేశ్‌గోపి నిరాకరించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదని నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు.

తాజాగా ఈ విషయంపై సురేశ్‌ గోపి స్పందించారు. మంత్రి సురేశ్‌ గోపి తన ఫేస్‌బుక్ పేజీలో వివరణ ఇస్తూ… తాను నిలబెట్టుకోలేని అబద్ధపు హామీలు ప్రజలకు ఇవ్వలేనని అన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలు కాబట్టి… ఆ వృద్ధుడి నుంచి అప్లికేషన్‌ తీసుకోలేదని తెలిపారు. కొన్ని పార్టీలు ఈ వీడియోను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. అయితే ఆ వృద్ధుడి కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని మరో పార్టీ ముందుకురావడం సంతోషకరమైన విషయమన్నారు. దానివెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నా వారికి సొంత ఇల్లు ఇవ్వడం ముఖ్యమన్నారు.

Also Read : Supreme Court: వక్ఫ్‌ చట్టం-2025లో ఓ ప్రొవిజన్‌ నిలిపేసిన సుప్రీంకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!