Suresh Gopi: వివాదంలో కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ !

వివాదంలో కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ !

Suresh Gopi: కేరళ నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా ఎంపికై… మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి(Suresh Gopi) శనివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్‌ ఆఫ్‌ ది నేషన్‌’గా అభివర్ణించి సంచలనం రేపారు. శనివారం(జూన్‌ 15) కేరళ త్రిసూర్‌లోని కాంగ్రెస్‌ నేత కరుణాకరణ్‌ సమాధి ‘మురళి మందిర్‌’ను సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా సురేష్‌ గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కరుణాకరన్‌తో పాటు మాజీ సీఎం ఈకే నయనార్‌ తనకు రాజకీయ గురువులని తెలిపారు. కేరళ కాంగ్రెస్‌కు కరుణాకరణ్‌ తండ్రి అని చెప్పారు. అయితే తన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించవద్దని మీడియాను కోరారు. అంతేకాదు ఇటీవల తాను కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Suresh Gopi Issues..

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచింది. త్రిసూర్‌ నుంచి సురేశ్‌గోపీ 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రాష్ట్రం నుంచి గెలిచిన తొలి బీజేపీ ఎంపీగా రికార్డు క్రియేట్‌ చేశారు. కరుణాకరన్ కుమారుడు కె.మురళీధరన్ మూడో స్థానంలో నిలిచారు. దీంతో కేంద్రంలోని మోదీ 3.0 మంత్రి వర్గంలో సురేశ్‌గోపీ(Suresh Gopi)కి చోటు దక్కింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి బాధ్యతలు చేపట్టారు. అయితే, తనకు సహాయ మంత్రి పదవి కేటాయించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని, మోదీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే, సురేష్ గోపి ఆ వార్తలను తోసిపుచ్చారు. కేరళ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ మోదీ ప్రభుత్వంలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

Also Read : Petrol Prices: వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్‌ ! పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెంపు !

Leave A Reply

Your Email Id will not be published!