Gyanvapi Survey : భారీ భద్రత మధ్య జ్ఞాన్ వాపి మసీదు సర్వే
వారణాసి కోర్టు ఆదేశాల మేరకు స్టార్ట్
Gyanvapi Survey : యూపీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ వారణాసి కోర్టు ఆదేశాల మేరకు జ్ఞాన్ వాపి మసీదు సర్వే(Gyanvapi Survey) ప్రారంభమైంది. దీనిపై ఓ వర్గం వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కానీ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సైతం తాము సర్వేను నిలిపేవేయాలని ఆదేశించ లేమంటూ స్పష్టం చేశారు.
రెండు రోజుల ఉత్కంఠకు తెర దించుతూ శనివారం పోలీసు బలగాల మోహరింపు తో జ్ఞాన్ వాపి మసీదు పై సర్వే (Gyanvapi Survey) ప్రారంభమైంది. ఈనెల 17 లోగా సర్వే ను పూర్తి చేసి సదరు నివేదికను సమర్పించాలని వారణాసి కోర్టు ఆదేశించింది.
దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ముస్లింల తరపున న్యాయవాది. దీనిపై విచారించిన కోర్టు జోక్యం చేసుకోలేమంటూ తీర్పు చెప్పింది.
కాగా జ్ఞాన్ వాపి కాంప్లెక్స్ లోపల వీడియోగ్రఫీ పై మసీదు కమిటీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సర్వే ఎట్టి పరిస్థితుల్లో ఆప వద్దని, చేయాల్సిందేనంటూ వారణాసి సిటీ సివిల్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దీంతో తీవ్ర అభ్యంతరాల మధ్య జ్ఞాన వాసి మసీదులో సర్వే కొనసాగించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే సర్వే ప్రారంభం కావడంతో జ్ఞాన వాసి చుట్టూ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా దేశంలోనే అత్యంత పేరొందిన కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఈ జ్ఞాన్ వాసి మసీదు ఉంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శనం సజావుగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు కాశీ జోన్ డిప్యూట కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎస్. గౌతమ్.
Also Read : షేక్ ఖలీఫా మృతిపై మోదీ దిగ్భ్రాంతి