US Supreme Court : అబార్షన్ కు సంబంధించిన హక్కులపై అమెరికాకు చెందిన సుప్రీంకోర్టు(US Supreme Court )కీలక తీర్పు ఇవ్వనుంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు ఓ ముసాయిదా విడుదలైంది కూడా. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
ఆందోళనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ సామ్యూల్ అలిటో ఆ ముసాయిదాలో కొన్ని కీలక అంశాల గురించి కూలంకుశంగా రాశారు. కోర్టు నుంచి డాక్యుమెంట్ లీక్ కావడాన్ని అమెరికన్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
గతంలో జరిగిన అమెరికా చరిత్రలో ఎలాంటిది జరగలేదని పేర్కొన్నారు. వచ్చే జూలైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు (US Supreme Court )తన అంతిమ తీర్పు వెలువరించాల్సి ఉంది.
అనుకోకుండా లీకైన సమాచారంపై కోర్టు వైట్ హౌజ్ ఇప్పటి వరకు స్పందించ లేదు. అబార్షన్ హక్కులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ముసాయిదాలో వ్యక్తం చేయడంపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్లు జస్టిస్ అలిటో అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా రిపబ్లికన్ నాయకులు న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పు సరిగా లేదని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగడం ఆందోళన కలిగిస్తోంది.