TDP MLA’s Suspension : ఓవర్ యాక్షన్ టీడీపీ సభ్యుల సస్పెన్షన్
స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు విసిరేశారు
TDP MLA’s Suspension : చట్ట సభలు రాజకీయాలకు, వ్యక్తిగత ద్వేషాలకు, బల ప్రదర్శనకు వేదికలుగా మారాయి. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు సభ్యులపై స్పీకర్ వేటు వేశారు.
సమావేశాలు పూర్తయ్యేంత వరకు వారికి ఛాన్స్ లేకుండా చేశారు. సేమ్ సీన్ ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది. స్పీకర్ తమ్మినేని సీతారాంపై పేపర్లు విసరడంతో పాటు అనుచిత ప్రవర్తన కారణంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులపై(TDP MLA’s Suspension) వేటు వేశారు.
దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. టీడీపీకి చెందిన వారిలో బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరిగేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సభ్యుల అనుచిత ప్రవర్తనపై సీరియస్ అయ్యారు.
సభలో ప్రజా సమస్యలను , రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలను ప్రస్తావించాల్సిన సభ్యులు ఇలా అమర్యాద పూర్వకంగా ప్రవర్తించడం దారుణమన్నారు స్పీకర్ సీతారాం. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు దారుణంగా ప్రవర్తించారు. అసెంబ్లీలో రచ్చ రచ్చ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఆయనపై చించి వేసిన పేపర్ల ను విసిరి వేశారు.
సభను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ సీతారాం పట్ల టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా అడ్డుకోవవం దారుణమన్నారు.
Also Read : ఆవిర్బావ సభలో పవన్ ఏం మాట్లాడబోతున్నారో?