Sonali Phogat : సోనాలీ ఫోగ‌ట్ మృతిపై అనుమానం

వ్య‌క్తం చేసిన కుటుంబీకులు

Sonali Phogat : టిక్ టాక్ స్టార్, హ‌ర్యానాకు చెందిన బీజేపీ లీడ‌ర్ సోనాలీ ఫోగ‌ట్ గోవాలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఆమెకు 42 ఏళ్లు. త‌ను స్నేహితుల‌తో క‌లిసి గోవాకు వెళ్లింది.

అక్క‌డ స‌డన్ గా గుండె నొప్పి వ‌చ్చింద‌ని ఆస్ప‌త్రికి తీసుకు వెళ్లే లోపు చ‌ని పోయింద‌ని స‌మాచారం అందింది. అయితే కుటుంబీకులు మాత్రం సోనాలీ ఫోగ‌ట్ మృతి పై త‌మ‌కు అభ్యంత‌రాలు ఉన్నాయ‌ని, అనుమానం ఉందంటూ పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం సోనాలీ సోద‌రి దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతున్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని డిమాండ్ చేసింది.

పోలీసులు సోనాలీ ఫోగ‌ట్(Sonali Phogat) మ‌ర‌ణాన్ని అస‌హ‌జ మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేశారు. ప‌లు ప్ర‌శ్న‌ల మ‌ధ్య పోస్టుమార్టం మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హిస్తోంది.

అరెస్ట్ కు సంబంధించిన నివేదిక‌ల‌ను ఖండించారు. సోనాలీ ఫోగ‌ట్ కు చెందిన స‌న్నిహితులు లేదా ఆమె వ‌ద్ద ప‌ని చేస్తున్న వారిని సాక్షులుగా విచారిస్తామ‌ని చెప్పారు.

తాము దీనిని సీరియ‌స్ గా తీసుకుంటున్నాము. ఈ కేసును స్వ‌యంగా గోవా పోలీస్ బాస్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ద‌ర్యాప్తు, పోస్ట్ మార్టం నివేదిక‌లు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్.

గోవాలోని పంజిమ్ లో బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సోనాలీ ఫోగ‌ట్ గుండె పోటుతో మ‌ర‌ణించడాన్ని తాము అంగీక‌రించ లేమ‌ని సోద‌రీమ‌ణులు తెలిపారు.

ఆమె శారీర‌కంగా బ‌లంగా ఉంది. సోనాలీ ఫోగ‌ట్ కు గుండె పోటు వ‌చ్చే అవ‌కాశం లేదు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ద్వారా విచార‌ణ జ‌రిపిస్తేనే అస‌లు దోషులు ఎవ‌రో తేలుతుంద‌న్నారు సోద‌రి.

Also Read : భార‌తీయ టెక్కీతో ఎలోన్ మ‌స్క్ దోస్తీ

Leave A Reply

Your Email Id will not be published!