Swami Prasad Maurya : బ్యాలెట్ అయితే ఎస్పీ గెలిచేది

ఈవీఎంల వ‌ల్లే బీజేపీ విజ‌యం

Swami Prasad Maurya : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రోసారి సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆధ్వ‌ర్యంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌ధాని మోదీ, అమిత్ షాను క‌లుసుకున్నారు. కేబినెట్ కూర్పుపై చ‌ర్చించారు.

ఈ త‌రుణంలో ఈవీఎంల నిర్వాకం వ‌ల్ల‌నే బీజేపీ విజ‌యం సాధించింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎస్పీ నాయ‌కుడు స్వామి ప్ర‌సాద్ మౌర్య‌(Swami Prasad Maurya). ఇదిలా ఉండ‌గా ఖుషీ న‌గ‌ర్ జిల్లాలోని ఫాజిల్ న‌గ‌ర్ అసెంబ్లీ నుంచి ఆయ‌న పోటీ చేసి ఓడి పోయారు.

ఇవాళ ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ప‌ద్ద‌తిన పోలింగ్ జ‌రిగి ఉండి వుంటే స‌మాజ్ వాది పార్టీ క‌నీసం 304 సీట్లు వ‌చ్చేవ‌ని ఆరోపించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి 99 సీట్లు వ‌చ్చేవ‌న్నారు.

కాగా ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను అడ్డం పెట్టుకుని గెలుపొందిందంటూ మండిప‌డ్డారు. కాగా స్వామి ప్ర‌సాద్ మౌర్య అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే ముందు యోగి స‌ర్కార్ లో ఉన్నారు.

యోగితో ప‌డ‌క‌, బీజేపీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు సామాన్యుల‌కు చేర‌డం లేదంటూ ఆరోపిస్తూ పార్టీని వీడారు. స‌మాజ్ వాది పార్టీలో చేరారు. ఆనాటి స‌మ‌యంలో మౌర్య నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

గ‌తంలో త‌న‌కు ప‌ట్టున్న ప‌ద్రౌన కాకుండా ఫాజిల్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి దిగి ఓట‌మి పాల‌య‌యారు. బీజేపీలో చేరే కంటే ముందు బీఎస్పీలో ఉన్నారు. ఇక్క‌డ మౌర్య ఓట‌మికి కార‌ణం బీఎస్పీ అభ్య‌ర్థినేంటూ స‌మాజ్ వాది పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

Also Read ; ఎమ్మెల్యేలు ఉంటేనే ప్ర‌జాస్వామం

Leave A Reply

Your Email Id will not be published!