Swapna Suresh : ప‌ట్టుబ‌డ్డ విదేశీయుడికి సీఎం సాయం

గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వ‌ప్న సురేష్

Swapna Suresh : కేర‌ళ బంగారం స్మ‌గ్లింగ్ కేసు నిందితురాలు స్వ‌ప్న సురేష్(Swapna Suresh) షాకింగ్ కామెంట్స్ చేశారు. 2017లో శాటిలైట్ ఫోన్ తో ప‌ట్టుబ‌డిన యూఏఈ జాతీయుడు త‌ప్పించుకునేందుకు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ సాయం చేశాడంటూ ఆరోపించారు.

కొచ్చిన్ లో సోమ‌వారం స్వ‌ప్నా సురేష్ మీడియాతో మాట్లాడారు. జూలై 4, 2017లో ఈజిప్టులో పుట్టిన యూఏఈ జాతీయుడిని కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తుర‌యా శాటిలైట్ ఫోన్ తో అదుపులోకి తీసుకున్నార‌ని తెలిపారు.

ప‌దేళ్ల కింద‌ట ప‌ట్టుబ‌డిన అత‌డిని చ‌ట్టం నుండి త‌ప్పించుకునేందుకు సీఎం స‌హ‌క‌రించాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. కేర‌ళ బంగారు అక్ర‌మ ర‌వాణా కేసులో స్వ‌ప్న ప్ర‌ధాన నిందితురాలిగా ఉన్నారు.

ఈ విష‌యంలో సీఎం కార్యాల‌యం జోక్యం చేసుకుంద‌ని, ఘ‌ట‌న జ‌రిగిన మూడు రోజుల త‌ర్వాత త‌న‌ను దేశం నుంచి వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చారంటూ ఆరోపించారు.

అత‌ను అరెస్ట్ చేసిన రోజు రాష్ట్ర రాజ‌ధాని లోని యూఏఈ కాన్సులేట్ నుండి సీఎం కార్యాల‌యంతో మాట్లాడాల‌ని నాకు కాల్ వ‌చ్చింది. నేను ఆయ‌న సెక్ర‌ట‌రీ ఎం. శివ శంక‌ర్ కి కాల్ చేశా విష‌యం తెలిపాన‌ని చెప్పింది స్వ‌ప్నా సురేష్‌(Swapna Suresh).

యూఏఈ జాతీయుడు జూన్ 30న ఉత్త‌ర కేర‌ళ లోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చాడు. అత‌ను రాష్ట్రంలో నాలుగు రోజులు గ‌డిపాడు. తిరుగు ప్ర‌యాణంలో ప‌ట్టుబ‌డ్డాడు.

అనుమానాస్ప‌దంగా ఉన్న విదేశీ పౌరుడికి సాయం చేసేందుకు సీఎం త‌న అధికారాన్ని దుర్వినియోగం చేశాడంటూ ఆరోపించారు స్వ‌ప్నా సురేష్‌.

Also Read : దైవం పేరుతో బీజేపీ భూ దందా

Leave A Reply

Your Email Id will not be published!