Swarna Ratham : ఘ‌నంగా స్వ‌ర్ణ ర‌థోత్స‌వం

పోటెత్తిన భ‌క్త జ‌న సందోహం

Swarna Ratham : తిరుమ‌ల – ముక్కోటి ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త జ‌న సందోహంతో నిండి పోయింది. సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. ఎక్క‌డ చూసినా భ‌క్తులతో నిండి పోయింది పుణ్య క్షేత్రం.

Swarna Ratham Viral in Tirumala

ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో(TTD) అత్యంత వైభ‌వోపేతంగా స్వ‌ర్ణ ర‌థోత్స‌వాన్ని నిర్వ‌హించారు. గోవిందా గోవిందా శ్రీ‌నివాసా గోవిందా , ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా అంటూ భ‌క్తుల నినాదాల‌తో హోరెత్తి పోయింది.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణ రథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవింద నామ స్మరణతో, భక్తి శ్రద్ధలతో లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవో లు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!