Swetcha Votarkar: పూర్ణ చంద్ర నాయక్‌ పై యాంకర్‌ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు

పూర్ణ చంద్ర నాయక్‌ పై యాంకర్‌ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు

Swetcha Votarkar : తెలుగు న్యూస్‌ రీడర్‌, యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమార్తె మరణానికి… ఆమెతో సహాజీవనం చేస్తున్న పూర్ణ చంద్ర నాయక్ కారణమంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. అయితే స్వేచ్ఛ (Swetcha Votarkar) తల్లిదండ్రుల ఫిర్యాదు అనంతరం… పూర్ణ చంద్ర నాయక్ మీడియాకు ఓ లేఖను విడుదల చేసారు. ఈ విషయంలో తన తప్పులేదని… తల్తిదండ్రులు పట్టించుకోకపవోడం వలనే… స్వేచ్ఛ ఒంటరితనానికి గురై డిప్రెషన్ కు లోనయిందని… అయితే స్వేచ్ఛను, తన కుమార్తెను తాను బాగా చూసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. అయితే స్వేచ్ఛ కుమార్తె మాత్రం పూర్ణచంద్ర నాయక్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. తన తల్లి మరణానికి పూర్ణ చంద్రనాయక్‌ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది.

Swetcha Votarkar Daughter

‘పూర్ణచంద్ర నాయక్‌ ఎప్పుడూ నన్ను విసిగించేవాడు. అమ్మని, నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదు. మా అమ్మ మరణానికి పూర్ణచంద్ర నాయక్‌ కారణం. ఆయన లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించింది. తన తల్లి మరణానికి పూర్ణచంద్ర నాయక్‌ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ ను చిక్కడ పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.

మీడియాతో పూర్ణ చంద్ర నాయక్‌ అడ్వకేట్‌ శ్రవణ్‌

మరోవైపు పూర్ణ చంద్ర నాయక్‌ అడ్వకేట్‌ శ్రవణ్‌ మీడియాతో మాట్లాడారు. పూర్ణచంద్ర నాయక్‌ను కలిసేందుకు వచ్చాను. పోలీసులు అనుమతించలేదు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ అందితే బెయిల్ పిటిషన్ వేస్తాం. మరికొద్ది సేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఫోక్సో కేసు నమోదు అయినట్లు నా దృష్టికి రాలేదు. స్వేచ్ఛ పేరెంట్స్ ఆరోపించిన దాని ప్రకారంగా ఈ కేసులో హత్య కోణం ఏం లేదు. పూర్ణ చంద్ర నాయక్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదు’అని వ్యాఖ్యానించారు.

Also Read : PM Modi: తెలంగాణపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!