INDW vs PAKW T20 World Cup : ఇండియా పాక్ బిగ్ ఫైట్
భారత్ వర్సెస్ పాకిస్తాన్ కీలక మ్యాచ్
INDW vs PAKW T20 World Cup : అందరి కళ్లు ఇప్పుడు దక్షిణాఫ్రికా మీదే ఉన్నాయి. దాయాదులైన భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఏ క్రీడ జరిగినా లేదా పురుషులైనా లేదా మహిళలైనా సరే(INDW vs PAKW T20 World Cup) ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 10న ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో అత్యంత బలమైన జట్టుగా పేరొందిన సఫారీ జట్టును శ్రీలంక మూడు పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఆదివారం మరో కీలక మ్యాచ్ భారత్ , పాకిస్తాన్ మహిళా జట్ల మధ్య జరగనుంది.
మొత్తం ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో గ్రూప్ లో 5 జట్లు ఆడతాయి. ప్రస్తుతం బి – గ్రూపులో దాయాది దేశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే కీలక పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 10న ప్రారంభమైన ఈ టోర్నీ ఈనెల 26న ముగుస్తుంది. ఆరోజే ఫైనల్. ఈసారి హాట్ ఫెవరేట్ గా ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ , సఫారీ జట్లు ఉన్నాయి. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో భారత్, పాక్ జట్లు తలపడతాయి.
సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఇప్పటి దాకా టీమిండియా ఆధిక్యంలో ఉంది. కానీ పొట్టి ఫార్మాట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్ లో 13 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో 10 మ్యాచ్ లలో భారత్ గెలుపొందగా 3 మ్యాచ్ లలో మాత్రమే పాకిస్తాన్ గెలుపొందింది.
భారత జట్టులో హర్మన్ ప్రీత్ కెప్టెన్ కాగా మంధాన, భాటియా, రిచా , షెఫాలీ, జెమీమా, డియోల్ , దీప్తి , దేవికా , రాధా , రేణుకా, అంజలి , పూఆ , రాజేశ్వరి, గైఖాద్ ఉన్నారు.
పాకిస్తాన్ టీమ్ లో మరూఫ్ కెప్టెన్ కాగా , అలియా, ఐమన్ , ఐషా , ఫాతిమా , జవేరియా, మునీబా , నష్రా , నిదా దార్ , ఒమైమా , సదాఫ్ , సాదియా , సిద్రా , తుబా హసన్ ఆడతారు.
Also Read : ఉత్కంఠ పోరులో శ్రీలంక విక్టరీ