China Taiwan War : దండయాత్రకు చైనా సిద్దం తైవాన్ ఆగ్రహం
దూకుడు పెంచిన డ్రాగన్ పై మండిపాటు
China Taiwan War : యావత్ ప్రపంచం తప్పు పట్టినా చైనా పట్టించు కోవడం లేదు. యుద్దానికి సై అంటోంది. తైవాన్ పై నిప్పులు చెరుగుతోంది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలు విధించింది.
గత కొంత కాలం నుంచీ తైవాన్ భూ భాగం తమదేనని అంటోంది. ఇదే విషయాన్ని ఐక్య రాజ్య సమితికి చెప్పింది. యావత్ ప్రపంచానికి అప్పీల్ కూడా చేసింది.
ఏ దేశమైనా లేదా ఎవరైనా సరే తమ అనుమతి లేకుండా తైవాన్ లో కాలు మోపేందుకు అనుమతి లేదంటూ హుకూం జారీ చేసింది. కానీ అమెరికా మాత్రం చైనా ఆదేశాలను బేఖాతర్ చేసింది.
ఆ దేశానికి చెందిన స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో అడుగు పెట్టారు. ఆపై తైవాన్ తో తాము స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో తీవ్రంగా స్పందించింది చైనా(China Taiwan War).
తమ దేశంలో ఉన్న అమెరికా రాయబారిని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ఆమె తైవాన్ ను వీడిన 24 గంటలు కాక ముందే ఫైటర్ జెట్ విమానాలను మోహరించింది. సైనిక విన్యాసాలు చేపట్టింది.
తైవాన్ జల సంధిలో యుద్ద నౌకలను దించింది. తైవాన్ చుట్టు చక్రబంధనం విధించింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పై యుద్దం చేస్తోంది. ఆ దేశాన్ని సర్వ నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది.
ఇప్పుడు చైనా తైవాన్ పై కన్నేసింది. కానీ తైవాన్ మాత్రం చైనాకు తల వంచేది లేదంటోంది. యుద్దానికి సై అంటోంది.
ప్రపంచ సూత్రాలకు భిన్నంగా చైనా వ్యవహరిస్తోందని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కిందంటూ తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు తైపీ ఆరోపించారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు బీజింగ్ ద్వీపాన్ని చుట్టు ముడుతోందని మండిపడ్డారు.
Also Read : తాలిబన్ల తీరుపై ‘ముబారెజ్’ కన్నెర్ర