Tajinder Pal Bagga : భ‌గ‌వంత్ మాన్ పై త‌జింద‌ర్ పాల్ ఫిర్యాదు

మ‌ద్యం సేవించి గురుద్వారాలోకి ప్ర‌వేశం

Tajinder Pal Bagga : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ పై నిప్పులు చెరిగాడు భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు త‌జింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా(Tajinder Pal Bagga). భ‌గ‌వంత్ మాన్ మ‌ద్యం సేవించి గురుద్వారా లోకి ప్ర‌వేశించాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ మేర‌కు త‌జింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా శ‌నివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న బైసాఖీ సంద‌ర్భంగా తాగిన మైకంలో త‌ఖ్త్ ద‌మ్ దామా సాహిబ్ లోకి ప్ర‌వేశించాడ‌ని ఆరోపించారు.

తాను చేసిన ఫిర్యాదుపై చ‌ర్య తీసుకోవాల‌ని కోరుతూ పంజాబ్ డైరెక్ట‌ర్ జ‌న‌రల్ ఆఫ్ పోలీస్ ని అభ్య‌ర్థించాడు. తాను చేసిన ఫిర్యాదు ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు.

మ‌త్తులో గురుద్వారా ద‌మ్ దామా సాహిబ్ లోకి ప్ర‌వేశించినందుకు సీఎం భ‌గ‌వంత్ మాన్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశా. నా ఫిర్యాదును ప‌రిశీలించి, విచార‌ణ జ‌రిపించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాన‌ని పేర్కొన్నాడు.

ఇది పంజాబ్ సంప్ర‌దాయానికి పూర్తి విరుద్ద‌మ‌ని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా పంజాబ్ సీఎం , ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు భ‌గ‌వంత్ మాన్ తాగిన మైకంలో త‌క్త్ ద‌మ్ దామా సాహిబ్ లోకి ప్ర‌వేశించారంటూ శిరోమ‌ణి గురు ద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ – ఎస్జీపీసీ శుక్ర‌వారం ఆరోపించింది.

ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా త‌న‌ను కావాల‌ని బ‌ద్ నామ్ చేసేందుకే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ సీఎం భ‌గ‌వంత్ మాన్ పేర్కొన్నారు.

తాను ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్నాన‌ని, త‌న‌కు కొన్ని విలువ‌లంటూ ఉన్నాయ‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

Also Read : గాంధీ ఫ్యామిలీతో ప్ర‌శాంత్ కిషోర్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!