Mullah Yaqub : పాకిస్తాన్ పై ఆఫ్గానిస్తాన్ క‌న్నెర్ర‌

దాడుల‌కు పాల్ప‌డితే జాగ్ర‌త్త‌

Mullah Yaqub : నిన్న‌టి దాకా ఆఫ్గ‌నిస్తాన్ కు పాకిస్తాన్ మిత్ర దేశం. కానీ గ‌త కొన్ని రోజుల నుంచి ఈ రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య తీవ్ర వివాదం నెల‌కొంది. ప్ర‌ధానంగా కార‌ణం ఏమిటంటే కాబోల్ ని కునార్ ఖోస్ట్ ప్రావిన్స్ ల‌లో వ‌రుస‌గా పాకిస్తాన్ వైమానిక దాడుల‌కు దిగుతోంది.

ఇప్ప‌టికే గ‌తంలో చేసిన దాడుల్లో 60 మంది సాధార‌ణ ఆఫ్గ‌నిస్తాన్ కు చెందిన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇది మొద‌టి సారి క్ష‌మిస్తున్నామ‌ని ఇంకోసారి గ‌నుక సీన్ రిపీట్ అయితే స‌హించ బోమంటూ హెచ్చ‌రించింది ఆఫ్గ‌నిస్తాన్ స‌ర్కార్.

కానీ పాకిస్తాన్ ఆఫ్గాన్ చేసిన హెచ్చ‌రిక‌ల్ని ప‌ట్టించు కోలేదు. మ‌రోసారి దాడుల‌కు దిగింది. దీంతో పాకిస్తాన్ పై నిప్పులు చెరిగింది. ఎవ‌రి ప‌రిధిలో వారుంటే మంచిద‌ని సూచించింది. ఇప్ప‌టి దాకా దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

దాంతో ఆఫ్గ‌నిస్తాన్ తాత్కాలిక ర‌క్ష‌ణ శాఖ మంత్రి ముల్లా మ‌హ్మ‌ద్ యాకూబ్(Mullah Yaqub) స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము ఇప్ప‌టి దాకా ప్ర‌పంచంతో పోరాడుతూ వ‌స్తున్నామ‌ని , చాలా ర‌కాలుగా స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నామ‌ని పేర్కొన్నారు.

కానీ పాకిస్తాన్, ఆఫ్గ‌నిస్తాన్ రెండూ స‌హోద‌ర దేశాలు. ఇవాల్టి వ‌ర‌కు దాడులు చేస్తూ వ‌స్తున్నా తాము భ‌రిస్తూ వ‌చ్చామ‌ని పేర్కొన్నారు. ఒక‌సారి హెచ్చ‌రించాం.

అయినా పాకిస్తాన్ లో ఎలాంటి మార్పు క‌నిపించ లేద‌న్నారు యాకూబ్. ఇప్ప‌టికైనా స్నేహంగా ఉందాం. కానీ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు. త‌మ స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తే చ‌ర్య‌లు తీవ్రంగా ఉంటాయ‌న్నారు.

Also Read : ర‌ష్యా ప‌ట్ల భార‌త్ స్ప‌ష్టంగా ఉంది

Leave A Reply

Your Email Id will not be published!