Taliban Warns : పాకిస్తాన్ కు తాలిబ‌న్లు స్ట్రాంగ్ వార్నింగ్

దాడుల‌కు పాల్ప‌డితే తీవ్ర చ‌ర్య‌లు

Taliban Warns : నిన్న‌టి దాకా స్నేహితులుగా ఉన్న ఆఫ్గ‌నిస్తాన్ , పాకిస్తాన్ లు ఇప్పుడు క‌య్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇక భార‌త్ మాత్రం వేచి చూసే ధోర‌ణి అవ‌లంభిస్తోంది. విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న‌టి దాకా భార‌త్ ను తూల‌నాడాడు.

ఇప్పుడు భార‌త దేశం అనుస‌రిస్తున్న విదేశాంగ విధానం గొప్ప‌దంటూ కితాబు ఇచ్చాడు. తాను ఏ దేశానికి వ్య‌తిరేకం కాద‌న్నాడు. తాజాగా అవిశ్వాస తీర్మానం ద్వారా 2 ఓట్ల తేడాతో ప్ర‌ధాని ప‌ద‌విని కోల్పోయాడు.

ఇప్పుడు చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాడు. తాలిబన్ల‌కు(Taliban Warns) మొద‌టి నుంచీ పాకిస్తాన్ అండ‌గా ఉంటూ వ‌స్తోంది. కానీ భార‌త్ మాత్రం ఆక‌లి కేక‌ల్లో ఉన్న ఆఫ్గ‌నిస్తాన్ ప్ర‌జ‌ల ఆక‌లిని తీర్చేందుకు నాణ్య‌మైన గోధుమ‌ల‌ను పంపించింది.

ఈ సంద‌ర్భంగా ఆఫ్గ‌నిస్తాన్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీస్తున్నాయి.

తాజాగా ఆఫ్గ‌నిస్తాన్ లోని ఖోస్ట్ ,కునార్ ప్రావిన్సుల‌పై పాకిస్తాన్ వైమానిక దాడుల‌కు తెగ‌బ‌డింది. ఈ దాడుల్లో 60 మందికి పైగా ఆఫ్గ‌నిస్తాన్ కు చెందిన సాధార‌ణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు తాలిబ‌న్లు(Taliban Warns). ఈ నేప‌థ్యంలో ఆదివారం పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదేశ రాయ‌బారిని పిలిపించి సీరియ‌స్ అయ్యారు.

ఇంకోసారి గ‌నుక దాడుల‌కు పాల్ప‌డితే తాము దాడుల‌కు దిగాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది ఆఫ్గ‌నిస్తాన్. దౌత్య మార్గాల్లో స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించు కోవాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం ఆఫ్గ‌న్ వార్నింగ్ క‌ల‌క‌లం రేగింది.

Also Read : 21న భార‌త్ కు రానున్న బోరిస్ జాన్స‌న్

Leave A Reply

Your Email Id will not be published!