Tamil University: చెన్నై పురావస్తు పరిశోధనలో లభ్యమైన రాతియుగం నాటి పనిముట్లు !
చెన్నై పురావస్తు పరిశోధనలో లభ్యమైన రాతియుగం నాటి పనిముట్లు !
Tamil University: కోయంబత్తూర్ జిల్లా మోలపాళయం ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయం(Tamil University) నిర్వహించిన పురావస్తు పరిశోధనల్లో కొత్త రాతియుగం పనిముట్లు లభ్యమయ్యాయి. ఈ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ సెల్వకుమార్ నేతృత్వంలో మోలపాళయంలో 2021లో పురావస్తు పరిశోధనలు జరిగాయి. ఈ విషయమై సెల్వకుమార్ మాట్లాడుతూ… నడి వయస్సు మహిళ, 3 నుంచి 7 ఏళ్లలోపున్న పిల్లల అస్తిపంజరాలు, పశువులు, మేకల అస్తిపంజరాలు, రోళ్లు, రోకళ్లు, ధాన్యం విత్తనాలు, రాతి గొడ్డళ్లు, కొత్త రాతియుగం నాటి కుండలు, సముద్రపు శంఖాలతో చేసిన దండలు, ధాన్యం సేకరణ పాత్రలు వంటివి కనుగొన్నామన్నారు.
Tamil University…
ఈ ప్రాంతంలో లభించిన మాంసపు ముక్కను అమెరికాలో ఉన్న బీటా ల్యాబ్‌కు పంపించి కాలాన్ని నిర్ధారించగా, 3,200 నుంచి 3,600 ఏళ్ల క్రితం జీవించిన మనుషులు ఆహారానికి వినియోగించిన ఎండు మాంసంగా గుర్తించారన్నారు. జూన్ లో చేపట్టిన పరిశోధనల్లో భూమిలో 80 నుంచి 140 సెం.మీ అడుగున కొత్త రాతియుగం నాటి పనిముట్లు లభించాయన్నారు. వీటితో పాటు మూడు సానపట్టిన రాతి గొడ్డళ్లు లభించాయని, మృతదేహాలను భద్రపరిచే శవపేటికలు కూడా కనుగొన్నామని తెలిపారు. ప్రస్తుతం లభ్యమైన వస్తువులను ప్రయోగశాలకు పంపించి వాటి కాలాలు నిర్ధారించనున్నామని తెలిపారు.
Also Read : Congress Meeting : ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ పార్టీ సమావేశం