Tamilisai Governor : మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారు – గ‌వ‌ర్న‌ర్

ఇస్రోను అభినందించిన త‌మిళి సై

Tamilisai Governor : ఇస్రో పేరు మారు మ్రోగుతోంది. యావ‌త్ భార‌త దేశం ఇంకా సంబురాల‌లో మునిగి పోయింది. చిన్నారుల నుంచి పెద్ద వారి దాకా అంద‌రూ కేరింత‌లు కొడుతున్నారు. తాము స్వ‌యం స‌క్సెస్ సాధించినంత‌గా గ‌ర్వ ప‌డుతున్నారు. ఇది ఆనంద‌క‌ర‌మైన క్ష‌ణమ‌ని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్(Tamilisai Governer).

Tamilisai Governor Feels Proud

ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ భార‌త్ సాధించిన అపురూప‌మైన‌, అసమాన్య‌మైన విజ‌యాన్ని నేను కూడా ద‌గ్గ‌రుండి చూశాన‌ని, మాట‌ల్లో చెప్ప‌లేక పోతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఏర్పాటు చేసిన చంద్ర‌యాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ కార్య‌క్ర‌మాన్ని లైవ్ లో వీక్షించారు. చంద్ర‌యాన్ -3 విజ‌యంపై ఆమె సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

భార‌త దేశం కూడా ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న చేరింద‌ని పేర్కొన్నారు. కేవ‌లం ఇప్ప‌టి వ‌ర‌కు చంద్రుడి వ‌ద్ద‌కు చైనా, ర‌ష్యా, అమెరికా మాత్ర‌మే వెళ్లే సాహ‌సం చేశాయ‌ని తెలిపారు. కానీ ఇవాళ స‌గ‌ర్వంగా ఇస్రో చేసిన ప్ర‌య‌త్నంతో భారత దేశం నాలుగో దేశంగా చ‌రిత్ర పుటల్లోకి ఎక్కింద‌ని , ఇది మ‌నంద‌రికీ ప్ర‌తి భార‌తీయుడికి గ‌ర్వ కార‌ణమ‌ని పేర్కొన్నారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌందర రాజ‌న్.

Also Read : Putin Congratulates : భార‌త్ కు పుతిన్ అభినంద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!