Tamili Sai Soundara Rajan : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (Tamili Sai Soundara Rajan)సంచలన కామెంట్స్ చేశారు. ఆమె ఇవాళ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తాను తమిళనాడుకు చెందిన దానినైనప్పటికీ రాష్ట్రంలోని ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు సరైన గౌరవం దక్కడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారిని కావాలని పక్కన పెడుతున్నారంటూ మండిపడ్డారు.
తనను ఎవరూ భయ పెట్ట లేరని..తాను దేనికీ భయ పడనంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై కి పడడం లేదు.
ఇటీవల నామినేటెడ్ ఎమ్మెల్సీ వ్యవహారంలో కొంత గ్యాప్ ఏర్పడింది. నేర చరిత్ర కలిగిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కోటా కింద సిఫారసు చేస్తూ ప్రభుత్వం ఫైల్ పంపించింది రాజ్ భవన్ కు . ఆ ఫైల్ పై సంతకం చేయకుండా గవర్నర్ నిలిపి వేసింది.
దీంతో ఎమ్మెల్యేల కోటా కింద కౌశిక్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డికి బదులు మధుసూదనాచారి కి ఓకే చేసింది.
ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలు సామాజిక సేవ చేసిన వారికి ప్రయారిటీ ఇస్తానని ప్రకటించింది.
Also Read : అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్