Tamilisai Soundara Rajan : నేను రబ్బర్ స్టాంప్ ను కాదు – తమిళిసై
కేసీఆర్ తో కష్టం పాలన ప్రమాదం
Tamilisai Soundara Rajan : రాజ్ భవన్ , ప్రగతి భవన్ ల మధ్య మాటల యుద్దం మరింత రాజుకుంది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇటీవలే మోదీ, అమిత్ షాతో కలిసిన అనంతరం సంచలన కామెంట్స్ చేసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundara Rajan )ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాను ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ సంతకం చేసే వ్యక్తిని కాదన్నారు. మంగళవారం చెన్నైలో జరిగిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి.
తాను ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులతో పని చేస్తున్నానని కానీ సీఎం కేసీఆర్ మామూలోడు కాదన్నాడు. ఆయన తనంతకు తాను ఓ నియంతగా భావిస్తున్నాడని అది అత్యంత ప్రమాదకరమన్నారు గవర్నర్.
ప్రస్తుతం సీఎంతో కలిసి పని చేయడం చాలా కష్టమన్నారు. రెండు రాష్ట్రాలలో విధులు చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఎవరితో ఎలా పని చేయాలో చేయించాలో తనకు బాగా తెలుసునని చెప్పారు తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundara Rajan ).
ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను దీనిని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
రాజ్యాంగబద్దంగా ఎన్నికైన వారు ఆ స్పూర్తిని విస్మరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎవరు గవర్నర్ గా ఉన్నా ప్రోటోకాల్ పాటించాల్సిందేనంటూ స్పష్టం చేశారు తమిళి సై.
విభేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆహ్వాలను రాజకీయంగా చూడ కూడదని చెప్పారు.
Also Read : పీకే పాత్రపై మేడమ్ దే తుది నిర్ణయం