Tamilisai Republic Day : పరేడ్ గ్రౌండ్స్ కాదు రాజ్ భవన్ లోనే
గవర్నర్ తమిళిసై తీవ్ర అసహనం
Tamilisai Republic Day : రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య పోరు కొనసాగుతోంది. గతంలో గణతంత్ర దినోత్సవ వేడుకులను పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే వారు. కానీ కరోనా కారణంగా రాజ్ భవన్ లో ఇటీవల నిర్వహించారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. జనం యధావిధిగా తమ కార్యకలాపాలలో మునిగి పోయారు.
జనవరి 26 సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఈసారి గణతంత్ర వేడుకలు ఉంటాయని అంతా భావించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు లేఖ కూడా పంపింది. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గవర్నర్. కరోనా పేరుతో గణతంత్ర వేడుకలు నిర్వహించక పోవడాన్ని తప్పు పట్టారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమంటూ పేర్కొన్నారు తమిళి సై సౌందర రాజన్(Tamilisai Republic Day).
ఇదిలా ఉండగా ఈ విషయాన్ని జనవరి 21న రాజ్ భవన్ కు లేఖ పంపింది రాష్ట్ర సర్కార్. ఈసారి కూడా రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఎగుర వేస్తారని, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ పాల్గొంటారని వెల్లడించింది. మరో వైపు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించక పోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Also Read : గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం