Tamil Nadu vs Tamilagam Comment : ‘తమిళగం’ మారిన స్వరం
తమిళనాడును మార్చమనలేదు
Tamil Nadu vs Tamilagam Comment : ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఉన్నత పదవుల్లో ఉన్న వారు ప్రత్యేకించి రాజ్యాంగానికి రక్షకులుగా భావించే గవర్నర్లు మాట్లాడే సమయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సమయంలో ఇంకాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడితే బెటర్.
ఒక్కోసారి మనం ఏదైనా అనే ముందు ఒకటికి పదిసార్లు ఆ పదాలకు సంబంధించి అర్థం తెలుసుకుంటే రాద్దాంతం జరగదు. ప్రజల విద్వేషాలకు గురికాం. తాజాగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.
ఆయన మాట్లాడిన తీరు, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ప్రసంగాన్ని అవమానించిన తీరు గర్హనీయం. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తమిళ ప్రజలు తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించారని భావించారు.
ప్రత్యేకంగా తమిళులకు తమ ప్రాంతమన్నా, తమ భాష, సంస్కృతి, నాగరికత అంటే చచ్చేంత అభిమానం.భాషా సంయుక్త రాష్ట్రాలుగా విడి పోయినా ఎక్కువగా ప్రాంతీయ అభిమానం తమిళులకు ఎక్కువ.
కేంద్రంలో అధికారంలో ఉన్నామని , దాని అండ చూసుకుని ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే పొరపాటు అవుతుంది.
తమిళనాడుకు బదులు తమిళగం(Tamil Nadu vs Tamilagam) మార్చాలని, దానిని ఉపయోగిస్తే బావుంటుందని స్పష్టం చేశారు శాసనసభ సాక్షిగా గవర్నర్ ఆర్ఎన్ రవి. వెంటనే డీఎంకే చీఫ్ , సీఎం ఎంకే స్టాలిన్ అభ్యంతరం తెలిపారు.
గవర్నర్ తమిళనాడు ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారని, ఆయన మాటలను ఏవీ రికార్డులోకి తీసుకోవద్దని స్పీకర్ ను కోరారు. ఒక రకంగా ఇది అవమానకరంగా భావించారు గవర్నర్. గత కొంత కాలం నుంచీ సీఎం వర్సెస్ గవర్నర్ గా మారి పోయింది వ్యవహారం.
ఈ తరుణంలో తమిళనాడులో దేవుడి కంటే ఎక్కువగా కొలిచే పెరియార్ రామస్వామి నాయకర్ , డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లను కూడా పలికేందుకు ఇష్ట పడలేదు గవర్నర్.
ఆ వెంటనే ప్రసంగ పాఠాన్ని పూర్తి చేయకుండానే ఆగ్రహంతో వాకౌట్ చేశారు ఆర్ఎన్ రవి. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన డీఎంకే నేతలు ఆ వెంటనే గెటవుట్ రవి అంటూ పోస్టర్లు వేశారు.
ఆ తర్వాత సీనియర్ నాయకుడు ఏకంగా కాశ్మీర్ కు పంపిస్తామని హెచ్చరించారు. అటు బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్దం కొనసాగింది. చివరకు తమిళనాడు వర్సెస్ తమిళగం గా మారి పోయింది.
ఈ తరుణంలో ఎవరూ కూడా గవర్నర్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని కోరారు సీఎం స్టాలిన్. ఇదే సమయంలో గవర్నర్ గా తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ పరిధిలో ఉంటే బావుంటుందని గవర్నర్ కు హెడ్ గా ఉన్న రాష్ట్రపతికి లేఖ రాశారు సీఎం.
ఈ మొత్తం వ్యవహారంలో చివరకు బీజేపీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందని గ్రహించారు ఆర్ఎన్ రవి(RN Ravi). ఏకంగా గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది.
తమిళనాడు పదాన్ని మార్చాలని తాను అనలేదని కేవలం తమిళగం పదం బాగుందని ఉచ్చరించానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు గవర్నర్.
మొత్తంగా తమిళనాడులో తమిళగం గందరగోళానికి, ప్రజల ఆగ్రహావేశాలకు (Tamil Nadu vs Tamilagam) లోను అయ్యేలా చేసింది. ఇకనైనా గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరిస్తే రాష్ట్రానికి ఇటు ప్రజలకు మంచిది కదూ.
Also Read : మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్