Tammineni Veerabhadram : కాంగ్రెస్ మోసం సీపీఎం ఆగ్రహం
తమ్మినేని వీరభద్రం ఆగ్రహం
Tammineni Veerabhadram : హైదరాబాద్ – సీపీఎం జాతీయ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అమ్ముడు పోయే రకం కాదన్నారు. గణనీయమైన ప్రజా పోరాటల చరిత్ర తమకు ఉందన్నారు. తమది తోక పార్టీ కాదన్నారు. మేం రాష్ట్రంలో కొన్నిచోట్ల నిర్ణయాత్మక పాత్ర కలిగి ఉన్నామని, అందుకే బలమైన ప్రాంతాలలో తమ పార్టీ తరపున టికెట్లు ఇవ్వాలని కోరామని అన్నారు.
Tammineni Veerabhadram Serious on Congress
మొదట కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని స్పష్టం చేశారు. తాము 5 సీట్లు కావాలని కోరామని తెలిపారు. అయితే కుదరదని కేవలం 3 సీట్లు ఇస్తామన్నారని ఆ తర్వాత రెండు సీట్లకు దిగిందని, చివరకు ఒక సీటు కేటాయిస్తామంటూ బేరాలు పెట్టిందని ఆరోపించారు తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram).
ఇలా మాటలు మార్చి , నమ్మించి మోసం చేసే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. అందుకే తమ పార్టీ హైకమాండ్ తో చర్చించి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇవాళ ప్రజలు ఎవరికి ఓటు వేయాలనేది డిసైడ్ అయి ఉన్నారని , వారిని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదన్నారు.
తమ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు తొలి జాబితాలో 17 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. తాను పాలేరు నుంచి బరిలో ఉంటున్నట్లు తెలిపారు తమ్మినేని.
Also Read : IND vs SA ODI World Cup : వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర