Tammineni Veerabhadram: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు !

సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు !

Tammineni Veerabhadram: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే తమ్మినేనికి(Tammineni Veerabhadram) విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని… కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు రావొద్దని పార్టీ రాష్ట్ర కమిటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీరభద్రాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Tammineni Veerabhadram – తమ్మినేని ఆరోగ్యంపై బులెటిన్‌ విడుదల చేసిన ఏఐజీ ఆస్పత్రి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం బులెటిన్‌ విడుదల చేసింది. ‘‘తమ్మినేని వెంటిలేటర్‌ సపోర్ట్‌తో ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చారు. ఆయన గుండె, కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఊపిరితిత్తుల్లో నుంచి నీరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. వివిధ విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Also Read : YS Sharmila : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమితులైన వైఎస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!