Task Force Raid : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలోని ప్రముఖ హోటల్ గా పేరొందిన ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు (Task Force Raid )మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడుల్లో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక పట్టుబడిన వారిలో సినీ రంగానికి చెందిన వారు, పొలిటికల్ లీడర్ల పిల్లలతో పాటు ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులకు చెందిన పిల్లలు పట్టుబడిన వారు ఉండడం విశేషం.
యువతీ యువకులే. ఈ పబ్ కు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ అర్ధరాత్రి దాటాక 3.30 గంటల వరకు కూడా పబ్ కొనసాగడంపై టాస్క్ ఫోర్స్ (Task Force Raid )ఆరా తీస్తున్నారు.
పబ్ మేనేజర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నాగబాబు కూతురు నిహారిక కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంత మంది వద్ద డ్రగ్స్ దొరికినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే పోలీసులు మాత్రం ఏం జరగలేదని చెప్పడం విశేషం. అనంతరం వారందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఆదివారం తెల్ల వారుజామున 3 గంటల ప్రాంతంలో దాడికి పాల్పడ్డారు.
ఫుల్ మత్తులో ఉన్న వారంతా పోలీసులపై తిరగబడడం విశేషం. ఈ పబ్ ఓ ప్రముఖ వ్యక్తికి చెందినదని సమాచారం. పలువురు కుమారులు తిరగబడడం చర్చకు దారి తీసింది.
ఓ వైపు తెలంగాణ సర్కార్ డ్రగ్స్ లేదంటూ చెప్పడం, పబ్ సంస్కృతి ఎందుకు పెరిగిందో చెప్పాల్సి ఉంది.
Also Read : శుభప్రదం రాష్ట్రం అభివృద్ధి పథం